మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డు బ్రేక్ చేసేందుకు చేరువలో ఉన్నాడు. వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్ లెజెండ్ జావెద్ మియాందాద్ 1930 పరుగులతో 26 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ 1912 పరుగులతో సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే.. పాక్ క్రికెటర్ రికార్డుకు చెక్ పెట్టి.. అగ్రస్థానంలో […]

  • Publish Date - 12:31 pm, Sun, 11 August 19 Edited By:
మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డు బ్రేక్ చేసేందుకు చేరువలో ఉన్నాడు. వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్ లెజెండ్ జావెద్ మియాందాద్ 1930 పరుగులతో 26 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ 1912 పరుగులతో సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే.. పాక్ క్రికెటర్ రికార్డుకు చెక్ పెట్టి.. అగ్రస్థానంలో దూసుకెళ్లనున్నాడు.

కాగా, విండీస్‌పై మియాందాద్ 64 ఇన్నింగ్స్‌లో 1930 పరుగులు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 33 ఇన్నింగ్స్‌లోనే 1912 పరుగులు చేశాడు. మియాందాద్‌ చివరి సారి కరీబియన్‌ జట్టుపై 1993లో ఆడడంతో అప్పటి నుంచీ ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా 45 ఇన్నింగ్స్‌లో 1708 పరుగులు, దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్‌ కలీస్‌ 40 ఇన్నింగ్స్‌లో 1666, పాక్‌ బ్యాట్స్‌మన్‌ రమీజ్‌ రాజా 53 ఇన్నింగ్స్‌లో 1624 పరుగులతో వరుసగా నిలిచారు.

ఇదిలా ఉంటే గయానాలో జరిగిన మొదటి వన్డే వర్షం కారణంగా 13 ఓవర్ల ఆట తర్వాత రద్దైన విషయం తెలిసిందే. ఇవాళ క్వీన్స్‌ ఓవల్‌ పార్క్‌లో రెండో వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆటకు అంతరాయం కలగకుండా ఉండి.. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తే.. మరో కొత్త రికార్డు చేసే అవకాశముంది.