AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్‌లో పాక్‌ చిత్తు.. 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..

India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 228 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. భారత్‌ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్‌లో పాక్‌ చిత్తు.. 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..
India Won On Pakistan
Shiva Prajapati
|

Updated on: Sep 11, 2023 | 11:32 PM

Share

India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 228 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్ ఇండియా. భారత్‌ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేయగా.. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్ సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ఆల్ రౌండర్ కుల్‌దీప్ యాదవ్.. తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ జట్టును మట్టికరిపించాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన నిర్దేశించింది. రిజర్వ్‌ డేలో టీమిండియా నిర్ణతీ 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 47వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. కేవలం 94 బంతుల్లో 122 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ తన కెరీర్‌లో ఆరో వన్డే సెంచరీని నమోదు చేశాడు. 106 బంతుల్లో 111 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. దాంతో జట్టు స్కోర్ భారీగా పెరిగింది.

అయితే, వర్షం కారణంగా ఆదివారం నాడు మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది. వర్షం ప్రభావం తగ్గకపోవడంతో మ్యా్చ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ రిజర్వ్ రోజు అంటే ఇవాళ నిర్వహించారు. ఆదివారం మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 147 పరుగులు చేసింది. ఇవాళ ఈ స్కోర్ నుంచే భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టి.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. నిర్ణీత 50 ఓవర్లకు 356 పరుగులు చేసింది టీమిండియా.

357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. ఆది నుంచే ఆగమాగం అయిపోయింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు షేక్ అయిపోయింది. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాటపట్టారు పాక్ బ్యాట్స్‌మెన్. నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కుల్దీప్ సింగ్ స్పిన్ మాయాజాలానికి గిల గిల కొట్టుకున్నారు పాక్ బ్యాటర్స్. కుల్దీప్ వరుసగా 5 వికెట్లు పడగొట్టి రికార్డ్ సృష్టించాడు. మొత్తంగా 32 ఓవర్లకు 10 వికెట్ల కోల్పోయి ఆలౌట్ అయిన పాక్ కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

బీసీసీఐ ట్వీట్..

టీమిండియాను ప్రశంసిస్తూ జయ్ షా ట్వీట్..