IND vs IRE T20: వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించట్లేదు..? కెప్టెన్ అయ్యర్ ఆన్సర్ ఇదే..
బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త పిచ్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని అయ్యర్ స్పష్టం చేయడంతో నిరాశ చెందారు.

బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదని తెలిపాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వైభవ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురుచూసిన వాళ్లు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
అయితే టాస్ సందర్భంగా కెప్టెన్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘పిచ్ బాగున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఫీల్డింగ్ చేయబోతున్నాం. ఇది మాకు కొత్త పిచ్. మాలో చాలా మంది ఇంతకు ముందు ఇక్కడ ఆడలేదు. కాబట్టి, పరిస్థితులు, వాతావరణం, అలాగే వికెట్‌ను పరిగణనలోకి తీసుకుని, మేము మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మాలో చాలా మందికి ఇక్కడ ఆడటం ఇదే మొదటిసారి. కాబట్టి మేం వీలైనంత త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి.
నిన్న మాకు అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్ జరిగింది. కాబట్టి, కుర్రాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో, మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక్కడ ఐర్లాండ్‌లో, ఐర్లాండ్‌తో ఆడుతున్నాం, ఒకరి నుండి ఒకరు అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టుకోవాలి.’ అని అన్నాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ ఆడటంపై స్పందిస్తూ.. దురదృష్టవశాత్తు వైభవ్ ఈ రోజు ఆడటం లేదు. అతను ఒక అద్భుతమైన ఆటగాడు. కానీ స్పష్టంగా మా జట్టులో అపారమైన అనుభవం ఉంది, వారు భారత్ తరఫున గత రెండు సిరీస్‌లలో అద్భుతంగా రాణించారు. కాబట్టి మేం ఈ సీజన్ అంతా అద్భుతంగా ఆడుతున్న వారిని కంటిన్యూ చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు వైభవ్‌కు కచ్చితంగా ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతానికి,మేం ముగ్గురు సీమర్లు, ఒక ఆల్-రౌండర్, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం అని కెప్టెన్ అయ్యర్ వెల్లడించాడు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(w/c), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్
Here is how #TeamIndia lines up for the 1️⃣st T20I against Ireland 📝
Updates ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND pic.twitter.com/H5nvE6XpQE
— BCCI (@BCCI) June 26, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
