AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Legends : గౌరవ హోదాల్లో క్రికెట్ దిగ్గజాలు.. మైదానంలోనే కాదు.. దేశసేవలోనూ ముందే..!

Indian Cricket Legends : మైదానంలో విజయాలతో దేశానికి కీర్తి తెచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు సైన్యం, వైమానిక దళం, పోలీసు శాఖలు గౌరవ హోదాలు ప్రదానం చేశాయి. ధోనీ, సచిన్, కపిల్ దేవ్, సిరాజ్, హర్భజన్, హర్మన్‌ప్రీత్‌లకు లభించిన ఈ గుర్తింపు యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Indian Cricket Legends : గౌరవ హోదాల్లో క్రికెట్ దిగ్గజాలు.. మైదానంలోనే కాదు.. దేశసేవలోనూ ముందే..!
Indian Cricket Legends
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 26, 2026 | 1:23 PM

Share

Indian Cricket Legends : క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత క్రికెట్ దిగ్గజాలు.. దేశ సేవలోనూ తమదైన ముద్ర వేశారు. బ్యాట్, బాల్‌తో కోట్లాది అభిమానులను సంపాదించిన పలువురు స్టార్ క్రికెటర్లకు భారత సైన్యం, పోలీసు శాఖలు గౌరవ హోదాలను ప్రధానం చేశాడు… వారి క్రమశిక్షణ, దేశభక్తి, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ హోదాల్లో వారు దేశ సేవలు చేస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా లో ఉన్నారు..ధోనీ తన విధుల్లో భాగంగా సైనికులతో కలిసి శిక్షణలో కూడా పాల్గొన్నారు. 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్‌కు భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్ లో ఉన్నారు… క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం గ్రూప్ క్యాప్టెన్ గౌరవ హోదాను ప్రదానం చేసింది..భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ పోలీస్ శాఖ డీఎస్పీ గౌరవ హోదా ఇచ్చింది.. అలాగే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పంజాబ్ పోలీస్‌లో డీఎస్పీ హోదాలు లభించాయి.

క్రీడల్లో విశేష సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు, రక్షణ దళాలు, పోలీసు శాఖలు ఇలాంటి గౌరవ హోదాలు ప్రదానం చేస్తుంటాయి.మైదానంలో విజయాలతో దేశానికి కీర్తి తీసుకురావడమే కాకుండా.. దేశసేవకు ప్రతీకలైన గౌరవ హోదాలను అందుకోవడం ద్వారా ఈ క్రికెటర్లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆటలో క్రమశిక్షణ, జీవితంలో దేశభక్తి కలిస్తే ఎంతటి గౌరవం దక్కుతుందో ఈ క్రికెట్ దిగ్గజాల ప్రయాణం మరోసారి చాటి చెబుతోంది.

Follow Us