AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ప్రతివారం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ షేక్ చేసిన 100 కోట్ల సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ సినిమా చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ఎక్కడ చూడొచ్చు అనే విషయం తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 2:30 PM

Share
Ra ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హిస్టారికల్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. అదే రాజా శివాజీ. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఇందులో ఆయన భార్య, కథానాయిక జెనీలియా ప్రధాన పాత్ర పోషించారు.

1 / 5
మే 1న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లూ రాబట్టింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ మరాఠీ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. అలాగే ఇందులో రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా యాక్టింగ్, డైరెక్షన్ పై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడే ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

2 / 5
తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరాఠీతోపాటు హిందీ బాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని ఇందులో చూపించారు. అయితే ఎలాంటి ప్రకటనలు, ప్రమోషన్స్ లేకుండా నేరుగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది.

3 / 5
 ఈ సినిమాలో విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 114.8 కోట్లు వసూలు చేసింది. కాగా, భారతదేశంలో ఇది 100 కోట్ల మార్కును దాటింది.'రాజా శివాజీ' చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి, మరాఠీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే , జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మించగా, జియో స్టూడియోస్ సమర్పించారు.

4 / 5
రాజా శివాజీ చిత్రంలో సల్మాన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రతాప్‌గడ్ యుద్ధంలో శివాజీ మహారాజ్ ప్రాణాలను కాపాడిన ధైర్యవంతుడైన యోధుడు జీవ మహాల పాత్రను ఆయన పోషించారు. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన ఎనిమిదవ భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే జెనీలియా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది.

5 / 5
Follow Us