AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే

T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియం నేడు ఒక హై-వోల్టేజ్ పోరాటానికి సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అసలు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం బౌలర్లే.

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే
T20 World Cup
Rakesh
|

Updated on: Mar 05, 2026 | 7:51 AM

Share

T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియం నేడు ఒక హై-వోల్టేజ్ పోరాటానికి సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అసలు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం బౌలర్లే. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన గత టీ20 రికార్డులను పరిశీలిస్తే, ఇరు జట్ల బ్యాటర్లను వణికించిన ఐదుగురు బౌలర్లు ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. వీరిలో ఎవరి మ్యాజిక్ వాంఖడేలో పండుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

1. క్రిస్ జోర్డాన్

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్ పేరు వింటే భారత బ్యాటర్లకు కొంచెం వణుకు పుట్టడం ఖాయం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఇతను వేసే ఖచ్చితమైన యార్కర్లు, తెలివైన స్లోయర్ బంతులు వికెట్లను టార్గెట్ చేస్తాయి. 2017 నుంచి 2024 వరకు భారత్‌పై 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. వాంఖడే వంటి చిన్న మైదానంలో జోర్డాన్ బౌలింగ్ ఇంగ్లాండ్‌కు ప్రధాన బలం.

2. హార్దిక్ పాండ్యా

టీమిండియా గబ్బర్ సింగ్ హార్దిక్ పాండ్యా కేవలం బ్యాట్‌తోనే కాదు, బంతితోనూ ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. కీలకమైన బ్రేక్-త్రూలు అందించడంలో హార్దిక్ తర్వాతే ఎవరైనా. ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకు 19 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు తీశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలగడం, షార్ట్ పిచ్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఇతని శైలి. సెమీస్ లాంటి బిగ్ మ్యాచ్‌లో హార్దిక్ స్పెల్ టీమిండియాకు చాలా ముఖ్యం.

3. వరుణ్ చక్రవర్తి

ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్న వరుణ్ చక్రవర్తి, తన మిస్టరీ స్పిన్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యాడు. బంతిని ఏ వైపు తిప్పుతాడో తెలియక ఇంగ్లీష్ ప్లేయర్లు తలలు పట్టుకుంటున్నారు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వేరియేషన్స్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించగలడు. వాంఖడే పిచ్‌పై స్పిన్ తిరిగితే వరుణ్ ఆపడం ఎవరితరం కాదు.

4. ఆదిల్ రషీద్

లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్ జట్టుకు ఒక నమ్మకమైన బౌలర్. మిడిల్ ఓవర్లలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో ఇతను దిట్ట. భారత్‌పై ఇప్పటివరకు 14 వికెట్లు పడగొట్టాడు. వికెట్ తీయకపోయినా, డాట్ బాల్స్ వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతాడు. భారత బ్యాటర్లు రషీద్‌ను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మన గెలుపు ఆధారపడి ఉంటుంది.

5. యుజ్వేంద్ర చాహల్

ప్రస్తుత జట్టులో లేకపోయినా, ఇంగ్లాండ్‌పై యుజ్వేంద్ర చాహల్ రికార్డు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చారిత్రక 6 వికెట్ల స్పెల్ ఇంగ్లాండ్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇంగ్లాండ్‌పై 16 వికెట్లు తీశాడు. ఒకే మ్యాచ్‌లో 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన రికార్డు ఇతని సొంతం. గాల్లో బంతిని ఫ్లైట్ చేస్తూ బ్యాటర్లను షాట్లకు ప్రేరేపించి వికెట్లు తీయడం చాహల్ స్టైల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us