అమ్మాయిల ఎఫైర్ల విషయంలో.. పాక్ క్రికెటర్ క్షమాపణలు

| Edited By:

Jul 30, 2019 | 2:00 PM

అమ్మాయిలను మోసం చేశాడంటూ తన పై వచ్చిన ఆరోపణలపై పాక్ క్రికెటర్ ఇమాముల్‌ హక్‌ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఈ వివాదంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీరియస్‌గా దృష్టి సారించడంతో ఇమాముల్ క్షమాపణలు చెప్పి.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరినట్లు పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు. ఎఫైర్ల విషయంలో ఇమాముల్‌ను హెచ్చరించామని.. వివరణ కూడా ఇవ్వాలని కోరినట్లు ఎండీ వసీం ఖాన్ తెలిపారు. అయితే ఇది ఇమాముల్‌ వ్యక్తిగత విషయం. కానీ.. […]

అమ్మాయిల ఎఫైర్ల విషయంలో.. పాక్ క్రికెటర్ క్షమాపణలు
Follow us on

అమ్మాయిలను మోసం చేశాడంటూ తన పై వచ్చిన ఆరోపణలపై పాక్ క్రికెటర్ ఇమాముల్‌ హక్‌ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఈ వివాదంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీరియస్‌గా దృష్టి సారించడంతో ఇమాముల్ క్షమాపణలు చెప్పి.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరినట్లు పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు.

ఎఫైర్ల విషయంలో ఇమాముల్‌ను హెచ్చరించామని.. వివరణ కూడా ఇవ్వాలని కోరినట్లు ఎండీ వసీం ఖాన్ తెలిపారు. అయితే ఇది ఇమాముల్‌ వ్యక్తిగత విషయం. కానీ.. పాక్ ఆటగాళ్లు క్రమశిక్షణతో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తున్నాం. అందుకే ఇమాముల్‌ను హెచ్చరించామని ఆయన చెప్పారు. ఇలాంటివి పాక్ జట్టులో మళ్లీ రిపీట్ కాకూడదని భావిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు.