Pro Kabaddi 2023: ‘తొడ కొట్టేది మనమే.. పడ గొట్టేది మనమే’.. తెలుగు టైటాన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన హీరో నాని

ప్రొ కబడ్డీ సీజన్‌లో 'తొడ కొట్టేది మనమే.. పడ గొట్టేది మనమే' అంటూ తెలుగు టైటాన్స్‌ అభిమానులను ఉత్సాహ పరిచారు న్యాచురల్‌ స్టార్‌ నాని. ఇదే సందర్భంగా ప్రొ కబడీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ విజేతగా నిలవాలని కోరుకుంటూ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు

Pro Kabaddi 2023: తొడ కొట్టేది మనమే.. పడ గొట్టేది మనమే.. తెలుగు టైటాన్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన హీరో నాని
Pro Kabaddi 2023, Actor Nani

Updated on: Dec 06, 2023 | 6:22 PM

కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబరు 2న అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియాలోని ఏకా అరేనా గ్రౌండ్ వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌ వర్సెస్‌ తెలుగు టైటాన్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ప్రొ కబడ్డీ సీజన్‌లో ‘తొడ కొట్టేది మనమే.. పడ గొట్టేది మనమే’ అంటూ తెలుగు టైటాన్స్‌ అభిమానులను ఉత్సాహ పరిచారు న్యాచురల్‌ స్టార్‌ నాని. ఇదే సందర్భంగా ప్రొ కబడీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ విజేతగా నిలవాలని కోరుకుంటూ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ‘బలమే కాదు, వేగం కూడా. ఇదొక ఛాలెంజ్ కాదు, యుద్ధం. మ్యాట్‌ పై జరిగేది సంగ్రామం. అలాగే ఒక రైడర్ ప్రత్యర్థి వ్యూహాన్ని ఛేదిస్తాడు. అతనే ఎలాంటి డిఫెన్స్‌కైనా దడ పుట్టిస్తాడు. ఈ పీకేఎల్‌-10 సీజన్‌లో తొడ కొట్టేది మనమే.. ప్రత్యర్థిని పడ గొట్టేది మన తెలుగు టైటాన్సే.
డిసెంబర్‌ 2 నుంచి ప్రతి రోజు రాత్రి 7.30 లకు స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగులో ఈ అల్టిమేట్ యాక్షన్ ని మీరు కూడా మిస్ కాకుండా చూడండి. ఇక ఫీల్‌ గుడ్‌ మూవీ ఎక్స్‌పీరియెన్స్‌ కోసమైతే హాయ్‌ నాన్న డిసెంబర్‌ 7న థియేటర్లలోకి వస్తున్నాడు. మీరు కూడా హాయ్‌ చెప్పండి’ అని పనిలో పనిగా తన సినిమాను కూడా ప్రమోట్‌ చేసుకున్నాడు నాని.

దీనికి సంబంధించిన వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు ప్రొ కబడ్డీ లీగ్‌ టోర్నీ జరగనుంది. అహ్మదాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతాచ, పంచకుల.. ఇలా మొత్తం 12 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కాగా ఈ కబడ్డీ లీగ్‌ ప్రమోషన్‌ కోసం పలువురు స్టార్‌ హీరోలు, హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారు. విక్కీ కౌశల్‌, తారా సుతారియా, శివ రాజ్‌ కుమార్‌, ఇప్పుడు నాని ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ జట్లకు మద్దతుగా మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..