ఐపీఎల్‌లో.. ఇకపై 10 జట్లు.?

ఐపీఎల్.. 2008లో మొదలైన ఈ పొట్టి క్రికెట్ అనధికాలంలోనే ప్రేక్షకాదరణ పొంది.. బీసీసీఐకు ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. మొదట్లో కొంతమంది విదేశీ క్రికెటర్లు ఇందులో పాల్గొనడానికి సుముఖత చూపించలేదు. అయితే రెండు మూడు సీజన్ల తర్వాత విదేశీ ప్లేయర్ల కౌంట్ పెరుగుతూ వచ్చింది. అలాగే ఐపీఎల్ ద్వారా స్పాన్సర్స్‌కు కూడా కాసుల వర్షం కురిసింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే 8 టీమ్‌లు ఉన్న ఐపీఎల్‌లో ఇకపై ఆ సంఖ్యను 10కి పెంచే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని […]

  • Ravi Kiran
  • Publish Date - 1:55 pm, Mon, 12 August 19
ఐపీఎల్‌లో.. ఇకపై 10 జట్లు.?

ఐపీఎల్.. 2008లో మొదలైన ఈ పొట్టి క్రికెట్ అనధికాలంలోనే ప్రేక్షకాదరణ పొంది.. బీసీసీఐకు ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. మొదట్లో కొంతమంది విదేశీ క్రికెటర్లు ఇందులో పాల్గొనడానికి సుముఖత చూపించలేదు. అయితే రెండు మూడు సీజన్ల తర్వాత విదేశీ ప్లేయర్ల కౌంట్ పెరుగుతూ వచ్చింది. అలాగే ఐపీఎల్ ద్వారా స్పాన్సర్స్‌కు కూడా కాసుల వర్షం కురిసింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే 8 టీమ్‌లు ఉన్న ఐపీఎల్‌లో ఇకపై ఆ సంఖ్యను 10కి పెంచే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది. అదానీ గ్రూప్(అహ్మదాబాద్), ఆర్పీజి – సంజీవ్ గోయెంకా గ్రూప్(పుణే), టాటాస్(రాంచీ లేదా జంషెడ్‌పూర్)తో పాటు కొన్ని ఇతర కార్పొరేట్ సంస్థలు ప్రాంఛైజీలు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2011లో టీమ్‌ల సంఖ్యను పెంచిన నిర్వాహకులు వివాదాలు నెలకొనడంతో రెండేళ్ల తర్వాత వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా టీమ్‌లు మరిన్ని పెరిగినా.. ఐపీఎల్‌ క్రేజ్ మాత్రం తారాస్థాయికి  చేరుతుందని చెప్పవచ్చు.