French Open 2021: క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు.. పురుషుల డబుల్స్‌ జోడీ కూడా..!

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్-2020లో పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత తన మొదటి టైటిల్ కోసం ఎదురుచూస్తోన్న సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకపోతోంది.

French Open 2021: క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు.. పురుషుల డబుల్స్‌ జోడీ కూడా..!
Pv Sindhu
Follow us
Venkata Chari

|

Updated on: Oct 29, 2021 | 2:37 PM

French Open 2021: టోక్యో ఒలింపిక్స్‌-2020లో పతకం సాధించి తొలి టైటిల్‌పై కన్నేసి ఓడిన భారత స్టార్‌ మహిళా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు.. పారిస్‌ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం చివర్లో జరిగిన మ్యాచ్‌లో మూడో సీడ్ సింధు 21-19, 21-9తో ప్రపంచ 24వ ర్యాంకర్ క్రిస్టోఫర్‌సన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ 37 నిమిషాల పాటు సాగింది.

ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ సింధు క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌తో తలపడనుంది. గత వారం డెన్మార్క్ ఓపెన్‌లో బుసానన్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్ జోడీ ఐదో సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కూడా 15-21, 21-10, 21-19తో స్వదేశానికి చెందిన ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిలను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత జోడీ ఇప్పుడు నాలుగో సీడ్ మలేషియా జోడీ ఆరోన్ చియా, సోహ్ వూయ్ యిక్‌తో తలపడనుంది.

పురుషుల సింగిల్స్.. పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో సౌరభ్ వర్మ రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటో చేతిలో 12-21, 9-21 తేడాతో ఓడి పోటీ నుంచి నిష్క్రమించాడు. యువ ఆటగాడు లక్ష్య సేన్ గురువారం సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూపై సులభంగా విజయం సాధించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

డెన్మార్క్ ఓపెన్‌లో.. భారత్ తరఫున రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి సింధు. టోక్యో ఒలింపిక్స్-2021లో కాంస్య పతకాన్ని సాధించింది. గతంలో రియో ​​ఒలింపిక్స్-2016లో రజత పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి పునరాగమనం చేసింది. కానీ, ఆమె ఈ టోర్నీ టైటిల్ గెలవలేకపోయింది. డెన్మార్క్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్‌ను దాటి వెళ్లలేకపోయింది. ఆమె కొరియాకు చెందిన యాన్ సెంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కొరియా ఆటగాడు 11-21, 12-21తో విజయం సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత, సింధు తనను తాను రిఫ్రెష్ చేసుకోవడానికి కొంత విరామం తీసుకుంది. మూడు నెలల పాటు ఆమె విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఒలింపిక్ పతక విజేత తిరిగి వచ్చిన తర్వాత ట్రోఫీ కోసం ఎదురు చూస్తుంది.

Also Read: AFG vs PAK T20 World Cup 2021 Match Prediction: తొలి ఓటమి ఎవరి ఖాతాలో పడనుందో? మెరుగైన రికార్డుతో బరిలోకి దిగనున్న ఆఫ్గాన్, పాక్..!

‘డేవిడ్ భాయ్’ ఈజ్ బ్యాక్.. 10 బంతుల్లో 40 పరుగులు.. అదిరే అర్ధ సెంచరీ.. బౌలర్లను ఉతికిఆరేశాడు.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే