‘ఇయాన్ మోర్గాన్’… కొండంత అభిమానంతో కొడుక్కి కెప్టెన్ పేరు!

సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఇంగ్లండ్ ప్రపంచకప్ కల నిజమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి.. ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు ఇంగ్లండ్‌కి ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. అయితే ఈ విజయాన్ని తమ దేశానికి అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఓ వ్యక్తి ఎనలేని అభిమానాన్ని చాటుకున్నాడు. జేమ్స్ అనే అభిమాని తనకు పుట్టిన కుమారుడికి ‘ఇయాన్ మోర్గాన్’ అని నామకరణం చేశాడు. ‘‘ఈ రోజు ఉదయం […]

'ఇయాన్ మోర్గాన్'... కొండంత అభిమానంతో కొడుక్కి కెప్టెన్ పేరు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 19, 2019 | 1:17 AM

సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఇంగ్లండ్ ప్రపంచకప్ కల నిజమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి.. ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు ఇంగ్లండ్‌కి ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. అయితే ఈ విజయాన్ని తమ దేశానికి అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు ఓ వ్యక్తి ఎనలేని అభిమానాన్ని చాటుకున్నాడు. జేమ్స్ అనే అభిమాని తనకు పుట్టిన కుమారుడికి ‘ఇయాన్ మోర్గాన్’ అని నామకరణం చేశాడు. ‘‘ఈ రోజు ఉదయం 11 గంటలకు జన్మించిన హెర్నీ ఇయాన్ మోర్గాన్‌ని కలుసుకోండి’’ అంటూ అతను మోర్గాన్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై మోర్గాన్ స్పందించాడు. ‘‘దట్స్ వెరీ కూల్, కంగ్రాట్యులేషన్స్’’ అంటూ మోర్గన్ పేర్కొన్నాడు.