ధోనీ రిటైర్మెంట్‌పై మేనేజర్‌ క్లారిటీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పుకార్లు ఆగడం లేదు. ఈ వార్తలను ధోనీ భార్య సాక్షి సహా పలువురు ఖండిస్తూ వస్తున్నప్పటికీ.. ఆయన రిటైర్మెంట్‌పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:40 pm, Thu, 9 July 20
ధోనీ రిటైర్మెంట్‌పై మేనేజర్‌ క్లారిటీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పుకార్లు ఆగడం లేదు. ఈ వార్తలను ధోనీ భార్య సాక్షి సహా పలువురు ఖండిస్తూ వస్తున్నప్పటికీ.. ఆయన రిటైర్మెంట్‌పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ గురించి ఆయన మేనేజర్‌ మిహిర్ దివాకర్‌ ఓ స్పష్టతను ఇచ్చారు. ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనలు లేవని ఆయన అన్నారు.

”క్రికెట్ గురించి మేం మాట్లాడుకోం. కానీ మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయనను చాలా దగ్గరగా చూసిన వాడిగా ఓ విషయం చెప్పగలను. ధోనికి ఇప్పట్లో రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచనలు లేవు. ఐపీఎల్‌ ఆడేందుకు ధోని ఎదురుచూస్తున్నాడు. దీనికి సంబంధించి లాక్‌డౌన్‌ కంటే ఒక నెల ముందు చెన్నైలో ఆయన ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సమయంలోనూ తన ఫామ్‌హౌజ్‌లో ఫిట్‌నెస్ కాపాడుకున్నారు. లాక్‌డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తేశాక మళ్లీ ధోనీ ప్రాక్టీస్‌‌ మొదలుపెడతారు అని మిహిర్ తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌పై సంగ్ధిగ్ధత కొనసాగుతుండగా దీనిపై బుధవారం మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లేకుండా 2020ను ముగించబోమని తెలిపిన విషయం తెలిసిందే.