ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఎగతాళి.. నవ్వుతూ రిప్లై ఇచ్చిన వార్నర్!

బర్మింగ్‌హామ్‌: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ టెస్ట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక వారికి టాంపరింగ్ సెగ తగిలింది. ఇంగ్లాండ్‌ అభిమానులు ఈ ఆటగాళ్లను మైదానంలో ఎగతాళి చేశారు. అయితే వారి ప్రవర్తనకు వార్నర్ వినూత్న రీతిలో జవాబు ఇచ్చాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. […]

ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఎగతాళి.. నవ్వుతూ రిప్లై ఇచ్చిన వార్నర్!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 05, 2019 | 2:44 AM

బర్మింగ్‌హామ్‌: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ టెస్ట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక వారికి టాంపరింగ్ సెగ తగిలింది. ఇంగ్లాండ్‌ అభిమానులు ఈ ఆటగాళ్లను మైదానంలో ఎగతాళి చేశారు. అయితే వారి ప్రవర్తనకు వార్నర్ వినూత్న రీతిలో జవాబు ఇచ్చాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బౌండరీ లైన్‌లో వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా ఇంగ్లాండ్‌ అభిమానులు అతన్ని విమర్శించారు. ‘అతని చేతిలో సాండ్‌ పేపర్స్ ఉన్నాయి’ అంటూ నినాదాలు చేశారు. దీనికి స్పందిస్తూ వార్నర్‌ తన రెండు అరచేతులను అభిమానులకు చూపించాడు. అంతేకాకుండా సాండ్‌ పేపర్‌ జేబుల్లో కూడా లేవని చమత్కారంగా తన ప్యాంట్‌ జేబులని తెరచి చూపించాడు. అతడి రెస్పాన్స్‌కు ఇంగ్లాండ్ అభిమానులు పాపం వార్నర్ అని ఊరుకున్నారు.

అటు స్టీవ్ స్మిత్.. ఇంగ్లాండ్ అభిమానులకు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన సెంచరీలు చేసి సరైన సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/B0tIOZRlCm8/?utm_source=ig_web_copy_link