ZIM vs IND 1st T20I Result: శ్రేయాస్ ఖాతాలో తొలి విక్టరీ.. జింబాబ్వేను చిత్తు చేసిన భారత్..
India vs Zimbabwe 1st T20 Score: జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రచ్చ చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని శ్రేయస్ సేన ఇంకా 40 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

India vs Zimbabwe 1st T20: తొలి టీ20లో జింబాబ్వేను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ప్రత్యుత్తరంగా, భారత్ 13.2వ ఓవర్‌లో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 118 రోజుల వయస్సులో అర్ధ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యాభై పరుగులు చేసిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. 16 సంవత్సరాల 56 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించిన జిబ్రాల్టర్‌కు చెందిన లూయిస్ బ్రూస్ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు.
గతంలో ఐర్లాండ్ సిరీస్‌ను 2-0తో, ఇంగ్లాండ్ సిరీస్‌ను 4-0తో కోల్పోయిన భారత్‌కు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇదే తొలి విజయం.
13.2 ఓవర్లలోనే ఫినిషింగ్!
లక్ష్య చేధనను భారత్ ఎంతో వేగంగా పూర్తి చేసింది. కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 126 పరుగులు సాధించి విజయాన్ని ముద్దాడింది. ఇంకా ఏకంగా 40 బంతులు మిగిలి ఉండగానే ఈ ఘనవిజయాన్ని అందుకోవడం విశేషం. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన టీమిండియా, జింబాబ్వేకు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా తొలి మ్యాచ్‌లోనే ముచ్చటైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ తిరుగులేని విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్‌లలోనూ కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘన విజయం
126 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది.
-
యంగెస్ట్ హాఫ్ సెంచరీ ప్లేయర్ల్స్..
టీ20ఐ మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కులు:
15సంవత్సరాల 118 రోజులు – వైభవ్ సూర్యవంశీ (భారతదేశం) vs జింబాబ్వే, హరారే, 2026
16సంవత్సరాల 56 రోజులు – లూయిస్ బ్రూస్ (జిబ్రాల్టర్) vs మాల్టా, అల్బెర్గేరియా, 2021
16సంవత్సరాల 76 రోజులు – కవిన్ చద్దా (ఇండోనేషియా) vs స్వీడన్, బాలి, 2026.
-
-
వైభవ్ ఔట్..
18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు.
-
పవర్ ప్లేలో పవర్ చూపించిన భారత్
పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 66 పరుగులు చేసింది. ఇందులో వైభవ్ 48 పరుగులు చేయడం గమనార్హం. ఇషాన్ 16 పరుగులు చేయగా, అభిషేక్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు.
-
బాల్ మార్చేసిన అంపైర్లు
బుడ్డోడు వరుస బౌండరీల బాదుడుతో బాల్ దెబ్బతింది. దీంతో అంపైర్లు బాల్ మార్చేశారు.
-
-
అభిషేక్ ఔట్..
2.3 ఓవర్‌కు టీమిండియాకు షాక్ తగిలింది. అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
-
2 ఓవర్లకు..
2 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 22 పరుగులతో నిలిచింది. వైభవ్ 20, అభిషేక్ 1 పరుగుతో క్రీజులో నిలిచారు.
-
ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్..
126 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలు క్రీజులోకి వచ్చారు.
-
IND vs ZIM: భారత్ టార్గెట్ 126
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ముందు తేలిపోయారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
-
18 ఓవర్లకు..
18 ఓవర్ల తర్వాత జింబాబ్వే జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్, ర్యాన్ బర్ల్‌ను ఔట్ చేశాడు. పేసర్ మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
-
5వ వికెట్ కోల్పోయిన జింబాబ్వే..
13.2 ఓవర్ల తర్వాత జింబాబ్వే జట్టు 5 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
-
ముగిసిన పవర్ ప్లే..
పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న జింబాబ్వే టీం 6 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.
మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్‌ను, ఐదో ఓవర్‌లో మైయర్స్‌ను అవుట్ చేయగా, ప్రిన్స్ యాదవ్ బెన్ కరన్‌ను ఔట్ చేశాడు.
-
4.2 ఓవర్లకు
4.2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే టీం 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది.
-
వికెట్‌తో రీఎంట్రీ ఇచ్చిన మయాంక్..
టీమిండియా స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు.
-
భారత్ ప్లేయింగ్ XI:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
-
జింబాబ్వే ప్లేయింగ్ XI:
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ.
-
IND vs ZIM Toss Update: టాస్ గెలిచిన భారత్..
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
-
Zimbabwe vs India, 1st T20I: పిచ్, వాతావరణం..
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన ఉపరితలంగా పరిగణించబడుతుంది. కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం అందించవచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. గురువారం హరారేలో ఎండగా ఉంటుంది, వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 25°C వద్ద ఉండే అవకాశం ఉంది.
-
IND vs ZIM Live Score: ఆధిపత్యం ఎవరిదంటే?
భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది.
-
ZIM vs IND T20 Live Score: కీలక పోరుకు రంగం సిద్ధం
మరికొద్దిసేపట్లో భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కీలక పోరు మొదలుకానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మరికొద్దిసేపట్లో షురూ కానుంది.
Published On - Jul 23,2026 3:43 PM




