AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng : లార్డ్స్ టెస్ట్‌లో వింత ఘటన.. బొక్క బోర్లా పడ్డ ఇంగ్లాండ్ ప్లేయర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

లార్డ్స్ టెస్ట్ మొదటి రోజున ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ రెండో పరుగు తీసే ప్రయత్నంలో బొక్క బోర్లా పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. మ్యాచ్ వివరాలు, తుది జట్లు వివరాలు తెలుసుకుందాం.

Ind vs Eng : లార్డ్స్ టెస్ట్‌లో వింత ఘటన.. బొక్క బోర్లా పడ్డ ఇంగ్లాండ్ ప్లేయర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
Zak Crawleys
Rakesh
|

Updated on: Jul 10, 2025 | 7:15 PM

Share

Ind vs Eng : లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి రోజున ఒక సరదా సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ రెండో పరుగు తీసే ప్రయత్నంలో బొక్క బోర్లా పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒకే పరుగుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతికి జరిగింది. బెన్ డకెట్ ఒక ఫుల్-పిచ్ డెలివరీని గ్రౌండ్ డౌన్ కొట్టాడు.. అది ఈజీగా రెండు పరుగులు తీసుకొచ్చేదిగా కనిపించింది. అయితే, రెండో పరుగు కోసం వెనక్కి వస్తున్న క్రాలీ బ్యాటింగ్ ఎండ్‌కు చేరుకోగానే జారిపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒకే పరుగుతో సంతృప్తి చెందారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్లను అవుట్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి తన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి, ఓపెనర్లను పెవిలియన్‌కు పంపాడు. ఇరు జట్లు తమ తుది పదకొండు మందిలో ఒక్కో మార్పు చేసుకున్నాయి. ఇంగ్లాండ్, ఒక రోజు ముందే ప్రకటించినట్లుగా జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ ను తీసుకుంది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రాను ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో తీసుకున్నట్లు ప్రకటించాడు.

భారత జట్టు : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయెబ్ బషీర్.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..