Chahal Dhanashree: విడాకులకు కారణం ఇదే! ధనశ్రీ-చాహల్ పిటిషన్‌లో షాకింగ్ విషయాలు..
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. మార్చి 20న బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 19 నెలల తరువాత వీరి విడాకులు షాకింగ్‌గా ఉన్నాయి. జూన్ 2022 నుండి వారు విడిగా ఉంటున్నప్పటికీ, కలిసి కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మతో అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 20న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీ, చాహల్ విడాకుల పిటిషన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇదంతా అందరి మధ్య జరిగేవి కదా అని అంటున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం, పిటిషన్ దాఖలు చేసిన వెంటనే విడాకులు మంజూరు చేయరు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరే అవకాశాన్ని పరిశీలించడానికి కుటుంబ కోర్టు దంపతులకు ఆరు నెలల సమయం ఇస్తుంది. అయితే, ధనశ్రీ, చాహల్ వెంటనే విడాకులు తీసుకోవాలని కోరుకున్నారు.
ఆ తర్వాత ఆ జంట బాంబే హైకోర్టుకు వెళ్లి, “మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం” అని పిటిషన్ దాఖలు చేశారు. “మాకు ఆరు నెలల వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని వారు పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, ఆ జంటకు వెంటనే విడాకులు మంజూరు చేయాలని కుటుంబ కోర్టును ఆదేశించింది. ఇప్పుడు ఆ దరఖాస్తులో ఒక షాకింగ్ వాస్తవం బయటపడింది. ఈ జంట డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. జూన్ 2022లో వారు విడిపోయారు! అవును, చాహల్, ధనశ్రీ వివాహం అయిన 19 నెలలకే విడిపోయారు. ఈ విషయాన్ని దరఖాస్తులో ప్రస్తావించారు. ధనశ్రీ, చాహల్ జూన్ 2022 తర్వాత చాలాసార్లు కలిసి కనిపించారు. వారు విడిపోయిన తర్వాత కూడా కలిసి కనిపించడం, ఫోటోలకు0 పోజులివ్వడం ఇప్పుడు అందర్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..