IPL 2025: ఐపీఎల్‌కి ముందు ఇర్ఫాన్ పఠాన్‌కి షాక్! ఆ ప్యానెల్ నుంచి తొలగింపు..
ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుండి మాజీ భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ను తొలగించారు. కొంతమంది ఆటగాళ్ళు అతనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఇర్ఫాన్ పఠాన్ తన కామెంటరీలో కొంతమంది ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది గతంలో సంజయ్ మంజ్రేకర్ కు కూడా జరిగింది. ఈ వివాదం తరువాత, ఇర్ఫాన్ పఠాన్ కు ఐపీఎల్ 2025 లో కామెంటరీ అవకాశం దక్కలేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కామెంటరీ ప్యానెల్ నుంచి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను తొలగించారు. గతంలో అనేక సీజన్లకు కామెంటేటర్‌గా వ్యవహరించిన ఇర్ఫాన్‌ను ప్యానెల్ నుంచి తొలగించడానికి ప్రధాన కారణం అతనిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలే. ఇర్ఫాన్ పఠాన్ కామెంట్రీ చేస్తున్నప్పుడు కొంతమంది ఆటగాళ్లను టార్గెట్‌గా చేసుకుంటున్నాడనే విమర్శలు వచ్చాయి. ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఉన్నాయనే కొంతమంది బహిరంగంగానే విమర్శించారు. అందువల్ల, అతన్ని ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుండి తొలగించినట్లు సమాచారం.
ముఖ్యంగా ఇర్ఫాన్ పఠాన్ కొంతమంది భారత ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు నిర్ధారణ కావడంతోనే అతన్ని ప్యానెల్ నుండి తొలగించినట్లు తెలుస్తోంది. కొంతమంది ఆటగాళ్ళు పఠాన్ కామెంట్రీపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఆటగాళ్ళు ఇర్ఫాన్ తమ గురించి వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ కు అతన్ని పరిగణించవద్దని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. గతంలో సంజయ్ మంజ్రేకర్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అందువల్ల, అతన్ని కూడా కొన్ని సంవత్సరాలు ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..