Asia Cup 2023: ఆసియా కప్‌ టీమ్‌లో నో ప్లేస్‌.. స్పిన్నర్‌ చాహల్‌ రియాక్షన్‌ ఏంటంటే?

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లను ప్రకటించే సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు ఇద్దరూ సమాధానమిచ్చారు. అయితే టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన యుజువేంద్ర చాహల్‌కు..

Asia Cup 2023: ఆసియా కప్‌ టీమ్‌లో నో ప్లేస్‌.. స్పిన్నర్‌ చాహల్‌ రియాక్షన్‌ ఏంటంటే?
Yuzvendra Chahal

Updated on: Aug 21, 2023 | 8:18 PM

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. టీమ్ ఇండియా ఆటగాళ్ల పేర్లను ప్రకటించే సమయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు ఇద్దరూ సమాధానమిచ్చారు. అయితే టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన యుజువేంద్ర చాహల్‌కు ఆసియా కప్‌లో టీమ్ ఇండియాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదనేది అతిపెద్ద ప్రశ్న. టీమిండియాలో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు స్పిన్నర్లుగా అవకాశం లభించింది. ఈ క్రమంలో ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన  భారత జట్టులో చోటు లభించకపోవడంపై యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా ఒక క్రిప్టిక్‌ మెసేజ్‌ షేర్‌ చేశాడు. యుజ్వేంద్ర చాహల్ ట్విట్టర్‌లో ఎమోజీని షేర్‌ చేసి తన భావోద్వేగాలను బయటపెట్టాడు. ఈ ట్వీట్‌లో ఒకవైపు సూర్యుడు ఆకాశం వెనుక దాక్కున్నట్లు కనిపించాడు. మరోవైపు బాణం సూర్యుడిని సూచిస్తుంది. ఈ ట్వీట్‌ ద్వారా మరోసారి తాను బలంగా జట్టులోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు చాహల్‌.

కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే?

కాగా యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా స్పందించారు. ‘ఆర్‌ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ అందరూ ప్రపంచ కప్‌లో భాగమే. ఇప్పటివరకు టీమ్ ఇండియాలో తలుపులు ఎవరికీ మూసుకుపోలేదు. టీమ్‌లో ఒకేసారి 17 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో అయిష్టంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతను ఈ సంవత్సరం అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక చాహల్‌కు కూడా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో చాలా అనుభవం ఉంది. రాబోయే టోర్నీల్లో అతని అనుభవాన్ని ఉపయోగించుకుంటాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ ‘ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్లలో చాహల్ ఒకడు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే జట్టులో సమతుల్యత కోసమే ఆసియా కప్‌ నుంచి చాహల్‌ను తప్పించాం’ అని అగార్కర్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ కోసం భారత జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మరియు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

స్టాండ్‌బై | సంజు శాంసన్ (రిజర్వ్ వికెట్ కీపర్)

చాహల్ ట్వీట్ ఇదే..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..