Video: 7 నెలల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. 3 బంతుల్లోనే 2 వికెట్లతో విధ్వంసం.. గ్యాప్ వచ్చినా తగ్గేదేలే అంటోన్న భారత బౌలర్..

India vs West Indies: ఆసియా కప్, ప్రపంచకప్‌లకు సంబంధించి టీమిండియాలో ఆటగాళ్ల ఎంపికలపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు, ఫాస్ట్ బౌలింగ్‌లో ఎవరికి అవకాశం లభిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వివిధ ఆటగాళ్ల పేర్లు సూచిస్తున్నారు. అయితే ఈ కాలంలో ఒక ఆటగాడు ఎక్కువగా విస్మరించబడ్డాడు. చర్చల్లోనే కాదు, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా టీమ్ ఇండియా అతడిని పట్టించుకోలేదు.

Video: 7 నెలల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. 3 బంతుల్లోనే 2 వికెట్లతో విధ్వంసం.. గ్యాప్ వచ్చినా తగ్గేదేలే అంటోన్న భారత బౌలర్..
Yuzvendra Chahal

Updated on: Aug 03, 2023 | 10:33 PM

Yuzvendra Chahal: ఆసియా కప్, ప్రపంచకప్‌లకు సంబంధించి టీమిండియాలో ఆటగాళ్ల ఎంపికలపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు, ఫాస్ట్ బౌలింగ్‌లో ఎవరికి అవకాశం లభిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వివిధ ఆటగాళ్ల పేర్లు సూచిస్తున్నారు. అయితే ఈ కాలంలో ఒక ఆటగాడు ఎక్కువగా విస్మరించబడ్డాడు. చర్చల్లోనే కాదు, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా టీమ్ ఇండియా అతడిని పట్టించుకోలేదు. ఈ ఆటగాళ్లు – లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చాహల్ కేవలం మూడు బంతుల్లోనే విద్వంసం చేశాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం ఇవ్వలేదు. టీం ఇండియా మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రయోగాలు చేసినప్పటికీ చాహల్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. గత 5 ఏళ్లలో భారతదేశం అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌లలో ఒకరికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ నిరంతరం ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కేవలం 3 బంతుల్లోనే చాహల్ అద్భుతం..

వన్డేల్లో చాహల్‌కు అవకాశం ఇవ్వనప్పటికీ, టీ20 సిరీస్ ప్రారంభంలో చాహల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ట్రినిడాడ్‌లో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో పాటు మూడో స్పిన్నర్‌గా చాహల్‌కు అవకాశం లభించింది. కేవలం 3 బంతుల్లోనే తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన చాహల్‌.. మ్యాచ్‌లో తన తొలి బంతికే వికెట్‌ తీశాడు. చాహల్ వేసిన బంతికి ఓపెనర్ కైల్ మేయర్స్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే మేయర్స్ ఇక్కడ పెద్ద తప్పు చేశారు. డీఆర్‌ఎస్ తీసుకుని ఉంటే బంతి వికెట్‌కు తగలకపోవడంతో అతడు ఔట్ అయ్యేవాడు కాదు. అదే ఓవర్ మూడో బంతికి చాహల్ రెండో ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

ప్రపంచకప్‌లో అవకాశం వస్తుందా?

ఇప్పుడు చాహల్ మొత్తం సిరీస్‌లో ఈ ప్రదర్శనను కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. ఆసియా కప్-వరల్డ్ కప్ కోసం తన స్థానాన్ని కాపాడుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ, గత 2 సంవత్సరాలుగా టీమ్ ఇండియా పరంగా చాహల్‌ అంతగా రాణించలేదు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టి, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఈ లెగ్ స్పిన్నర్‌ను టీమ్ ఇండియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో పట్టించుకోలేదు. 2021 ప్రపంచకప్‌లో అతను ఎంపిక కాలేదు. అయితే 2022 ప్రపంచకప్‌లో, జట్టులో ఎంపికైనప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..