Yashasvi Jaiswal: డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి జైస్వాల్.. అందరి చూపు ఆయనపైనే..

India vs England Second Test: తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అజేయంగా 179 పరుగులతో డబుల్ సెంచరీ అంచున నిలిచాడు. అందరి దృష్టి నేటి రెండో రోజు ఆటపైనే నిలిచింది. అతనితో పాటు ఆర్. అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు.

Yashasvi Jaiswal: డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి జైస్వాల్.. అందరి చూపు ఆయనపైనే..
Yashasvi Jaiswal Ind Vs Eng
Follow us
Venkata Chari

|

Updated on: Feb 03, 2024 | 7:44 AM

India vs England 2nd Test: వైజాగ్‌లోని డా. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. టాప్ ఆర్డర్ వైఫల్యం మధ్య ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆశలు కల్పించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అజేయంగా 179 పరుగులతో డబుల్ సెంచరీకి దగ్గరగా నిలిచాడు. నేడు అందరి దృష్టి రెండో రోజు ఆటపైనే ఉంది. జైస్వాల్‌తో పాటు ఆర్. అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్, రోహిత్ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బాగా ఆడుతున్న హిట్‌మన్ 14 పరుగుల వద్ద అవుట్ కాగా, శుభ్‌మన్ గిల్ (34) ఎక్కువ సేపు నిలవలేదు.

అనంతరం జైస్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ తుఫాన్ ఆటకు అయ్యర్ (27) మంచి సహకారం అందించాడు. అయ్యర్ నిష్క్రమణ తర్వాత తొలి టెస్టు మ్యాచ్ ఆడిన రజత్ పాటిదార్ 32 పరుగులు చేసి దురదృష్టకర రీతిలో వికెట్ కోల్పోయాడు.

అనంతరం వచ్చిన అక్షర్ పటేల్ 27 పరుగుల వద్ద వికెట్ లొంగిపోగా, వికెట్ కీపర్ కం బ్యాటర్ శ్రీకర్ భరత్ అనవసర షాట్ ఆడి 17 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ, జట్టు తరుపున ఒంటరి పోరాటం చేస్తున్న జైస్వాల్ డబుల్ సెంచరీకి చేరువలో నిలిచి, రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు.

ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసిన షోయబ్ బసీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీయగా, వెటరన్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్, గత మ్యాచ్‌లో హీరో టామ్ హార్ట్లీ ఒక్కో వికెట్ తీశారు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!