AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అనూహ్య మలుపు.. ఆసీస్ దెబ్బకు భారత్‌కు లక్కీ ఛాన్స్

WTC Points Table: బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఓటమితో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం తగ్గింది. శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ గెలిస్తే టీమిండియా నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌కు మరింత ఆశలు పెరిగాయి. ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అనూహ్య మలుపు.. ఆసీస్ దెబ్బకు భారత్‌కు లక్కీ ఛాన్స్
Wtc Points Table
Rakesh
|

Updated on: Aug 23, 2026 | 12:20 PM

Share

WTC Points Table: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకునే సువర్ణ అవకాశం ఇప్పుడు భారత జట్టు ముందు నిలిచింది. మ్యాకే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కేవలం 64 రన్స్‌కే కుప్పకూలింది. ఆస్ట్రేలియా 210 రన్స్ చేసి 146 రన్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్ బ్యాటర్లు విఫలమై 95 రన్స్‌కే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఏకంగా 10 వికెట్లతో చెలరేగారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1 తో సమమైంది.

తగ్గిన బంగ్లాదేశ్ పాయింట్ల శాతం

ఈ ఓటమితో బంగ్లాదేశ్ గెలుపు శాతం బాగా పడిపోయింది. గతంలో 66.67 శాతంతో ఉన్న బంగ్లాదేశ్, ఇప్పుడు 55.56 శాతానికి దిగజారింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు టెస్టుల్లో మూడింట్లో విజయం సాధించగా, రెండింటిలో ఓడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన బంగ్లా, రెండో మ్యాచ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

ఇది కూడా చదవండి: Vaibhav Sooryavanshi: అంత హైప్ ఇచ్చారు.. చివరికి 8 పరుగులేనా! వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి దెబ్బ

భారత్‌కు గోల్డెన్ ఛాన్స్

ప్రస్తుతం టీమిండియా 53.33 పాయింట్ల శాతంతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో విజయం సాధించి, సిరీస్‌ను 2-0 తో క్లీన్‌స్వీప్ చేస్తే పాయింట్ల శాతం 57.58 కి పెరుగుతుంది. తద్వారా భారత్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుత చక్రంలో భారత్ ఆడిన 10 టెస్టుల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి:Yash Chandra Prakash: ధోని స్ఫూర్తితో UPSCలో సక్సెస్! ఇప్పుడు నాగర్ కర్నూల్‌ ఎఫ్‌డీఓగా..

ఆగ్రస్థానంలో ఆస్ట్రేలియా

రెండో టెస్టులో సాధించిన విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల శాతం 77.78 నుంచి 80.00 కి పెరిగింది. పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక సిరీస్ తర్వాత భారత్ న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్‌కు మంచి అవకాశం లభించింది. శ్రీలంకపై రెండో టెస్టులో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుని భారత్ ముందుకు సాగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us