Video: క్రికెట్ పుట్టినింట్లో 100 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్.. ఆ జాబితాలో తోపు భయ్యో..

South Africa vs Australia, Final: దక్షిణాఫ్రికా సీమర్లు కగిసో రబాడ, మార్కో జాన్సెన్ విధ్వంసం సృష్టించిన తర్వాత, స్మిత్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు భారీ ఊరటనిచ్చాడు. ఓ దశలో 4 వికెట్లకు 67 పరుగులతో పీకల్లోతు కష్టాల నుంచి బయటపడేశాడు.

Video: క్రికెట్ పుట్టినింట్లో 100 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్టీవ్ స్మిత్.. ఆ జాబితాలో తోపు భయ్యో..
Steven Smith

Updated on: Jun 11, 2025 | 7:32 PM

Steve Smith Records: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తోన్న ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నిలబడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్‌గా రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ ఘనతను సాధించే క్రమంలో స్మిత్ సొంత దేశస్తుడైన వారెన్ బార్డ్స్లీ 575 పరుగులను అధిగమించాడు. తన హాఫ్ సెంచరీ సమయంలో లార్డ్స్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 551 పరుగులు చేసిన లెజెండరీ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మాన్‌ను కూడా అధిగమించడం గమనార్హం.

36 ఏళ్ల ఈ ఫేమస్ వేదికపై మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు చేశాడు. 2015లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో యాషెస్ టెస్ట్‌లో అత్యధిక స్కోరు 215 పరుగులు సాధించాడు.

దక్షిణాఫ్రికా సీమర్లు కగిసో రబాడ, మార్కో జాన్సెన్ విధ్వంసం సృష్టించిన తర్వాత, స్మిత్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాకు భారీ ఊరటనిచ్చాడు. ఓ దశలో 4 వికెట్లకు 67 పరుగులతో పీకల్లోతు కష్టాల నుంచి బయటపడేశాడు.

ఐదవ వికెట్‌కు ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌తో కలిసి యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను సురక్షితంగా మార్చాడు. సెంచరీ దిశగా కదులుతోన్న స్మిత్.. మార్ర్కమ్ బౌలింగ్‌లో 66 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి.

లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు..

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 10 ఇన్నింగ్స్‌లలో 588* పరుగులు

వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) – 7 ఇన్నింగ్స్‌లలో 575 పరుగులు

గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్) – 9 ఇన్నింగ్స్‌లలో 571 పరుగులు

డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) – 8 ఇన్నింగ్స్‌లలో 551 పరుగులు

శివనారాయణ్ చంద్రపాల్ (వెస్టిండీస్) – 9 ఇన్నింగ్స్‌లలో 512 పరుగులు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..