WTC Final 2023 India vs Australia live streaming: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ పోరు ఫ్రీగా చూడాలా.. ఇదిగో పూర్తి వివరాలు..
WTC Final Live Streaming: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇరుజట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ప్రారంభం కానుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. జూన్ 11న మ్యాచ్ ముగుస్తుంది.

WTC Final 2023 Live Streaming: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇరుజట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ప్రారంభం కానుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. జూన్ 11న మ్యాచ్ ముగుస్తుంది. అయితే, జూన్ 12 రిజర్వ్ డేగా ఉంచారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతోంది. ఈసారి టైటిల్ మ్యాచ్‌ని లైవ్‌లో ఎలా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 7వ తేదీ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగా, టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది.
లైవ్ టీవీని ఉచితంగా ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం దూరదర్శన్‌లో ఉచితంగా చూడొచ్చు.




ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా, ఎక్కడ చూడగలరు?
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు.
భారత్ vs ఆస్ట్రేలియా రికార్డులు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 106 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 44 విజయాలు సాధించగా, భారత్ 32 మ్యాచ్‌లు గెలిచింది. 29 మ్యాచ్‌లు డ్రా కాగా, 1 మ్యాచ్ టై అయింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు..
భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, ఛెతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, అజింక్యా రహానే, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ఆటగాళ్లు- యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా – పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, మైకేల్ నసీర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, జోష్ ఇంగ్లిస్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.
స్టాండ్‌బై ప్లేయర్‌లు – మిచ్ మార్ష్, మాట్ రెన్‌షా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




