AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్..ఎంగేజ్మెంట్ పోస్టులు తొలగింపు..అసలు జరిగింది ఏంటంటే?

ఈ ఏడాది జరగాల్సిన అతి పెద్ద క్రీడా ప్రముఖుల వివాహాల్లో ఒకటిగా భావించిన భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ వివాహం ఆగిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద మిస్టరీగా మారింది. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సిన ఈ వివాహాన్ని ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి.

Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్..ఎంగేజ్మెంట్ పోస్టులు తొలగింపు..అసలు జరిగింది ఏంటంటే?
Smriti Mandhana (3)
Rakesh
|

Updated on: Nov 28, 2025 | 10:27 AM

Share

Smriti Mandhana  : ఈ ఏడాది జరగాల్సిన అతి పెద్ద క్రీడా ప్రముఖుల వివాహాల్లో ఒకటిగా భావించిన భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ వివాహం ఆగిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద మిస్టరీగా మారింది. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సిన ఈ వివాహాన్ని ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయితే దీని వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని అన్‌వెరిఫైడ్ స్క్రీన్‌షాట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది, సోషల్ మీడియా కథనాలు ఏమిటో తెలుసుకుందాం.

క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి వేడుకలు నవంబర్ 23న జరగాల్సి ఉండగా, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా వేసినట్లు రెండు కుటుంబాలు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను, ఎంగేజ్మెంట్ వీడియోలను, ప్రపోజల్ వీడియోలను సైతం తొలగించింది. కానీ పలాష్ ముచ్చల్ తన సోషల్ మీడియా ఖాతాలో మాత్రం ఆ పోస్టులను అలాగే ఉంచాడు. దీంతో తెర వెనుక ఏదో పెద్ద సమస్య జరిగిందనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ వివాదంపై పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్చల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ వివాదం మరింత ముదరడానికి ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కారణమైంది. ఆ యూజర్ మే నెలలో పలాష్ ముచ్చల్‌తో జరిగినట్లుగా చెబుతున్న కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. అందులో పలాష్ ఆమెను కలవాలని అడగడం, తన గర్ల్‌ఫ్రెండ్ (స్మృతి మంధాన) గురించి అడిగితే దాటవేయడం వంటివి ఉన్నట్లు ఆరోపించింది.

తాజాగా రెడిట్ వంటి ఫోరమ్‌లలో ఈ విషయంలో కొన్ని అన్ వెరిఫైడ్ కథనాలు వైరల్ అవుతున్నాయి. ఒక పోస్ట్ ప్రకారం స్మృతి మంధాన తన ఫ్రెండ్, క్రికెటర్ అయిన శ్రేయాంక పాటిల్ సాయంతో పలాష్ ముచ్చల్‌ను చీటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి. పలాష్ ఒక కొరియోగ్రాఫర్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పెళ్లి రోజున గొడవ పెద్దదైందని, స్మృతి మంధాన సోదరుడు పలాష్‌పై దాడి కూడా చేశాడని ఆ వైరల్ పోస్ట్‌లో ఉంది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం, గొడవ పెద్దదైన తర్వాత పలాష్ తండ్రి ఛాతీ నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేరారని, అందుకే ఉదయం అతిథులకు స్మృతి తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పెళ్లి రద్దు చేశామని చెప్పారని ఉంది. ఈ గొడవ కారణంగా స్మృతి చాలా ఏడ్చిందని, వెంటనే పలాష్‌ను అతని సోదరి పాలక్ ముంబైకి తీసుకెళ్లిందని ఆ కథనాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటివరకు ఈ వైరల్ కథనాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ధృవీకరణ గానీ, స్మృతి మంధాన లేదా పలాష్ ముచ్చల్ తరఫున ఎలాంటి ప్రకటన గానీ రాలేదు. ప్రస్తుతం స్మృతి మంధాన తండ్రి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారని, పెళ్లి వాయిదా మాత్రమే అయ్యిందని, రద్దు కాలేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్మృతికి మద్దతు తెలుపుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..