AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : నో సెక్యూరిటీ, నో హంగామా..విరాట్ కోహ్లీ కోసం కారు నడిపిన ఎంఎస్ ధోని

భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ పార్ట్‌నర్‌షిప్‌ల్లో ఒకటైన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల కలయిక మళ్లీ జరిగింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రాంచీ చేరుకున్న కోహ్లీని, ధోని తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు. ఆ తర్వాత ధోని స్వయంగా తన ఎస్‌యూవీలో కోహ్లీని టీమ్ హోటల్‌కు దిగబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Viral Video : నో సెక్యూరిటీ, నో హంగామా..విరాట్ కోహ్లీ కోసం కారు నడిపిన ఎంఎస్ ధోని
Ranchi Reunion
Rakesh
|

Updated on: Nov 28, 2025 | 11:36 AM

Share

Viral Video : భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ పార్ట్‌నర్‌షిప్‌ల్లో ఒకటైన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల కలయిక మళ్లీ జరిగింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం రాంచీ చేరుకున్న కోహ్లీని, ధోని తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు. ఆ తర్వాత ధోని స్వయంగా తన ఎస్‌యూవీలో కోహ్లీని టీమ్ హోటల్‌కు దిగబెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా, ధోని డ్రైవింగ్ సీట్‌లో, కోహ్లీ పక్కన కూర్చుని ప్రయాణించడం.. పాత జ్ఞాపకాలను, వారిద్దరి మధ్య అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. ఈ అద్భుతమైన రీ-యూనియన్ ఆఫ్ ది ఇయర్ వివరాలు తెలుసుకుందాం.

సౌతాఫ్రికాతో నవంబర్ 30న రాంచీలో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ బుధవారం లండన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. రాంచీ చేరుకున్న కోహ్లీ, యువ ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి, మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిశారు. నవంబర్ 27వ తేదీ రాత్రి ధోని తన రాంచీ ఫామ్‌హౌస్‌లో వీరిద్దరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు.

కోహ్లీ, ధోని నివాసంలోకి వెళ్తున్న దృశ్యాలను అభిమానులు గుర్తించడంతో ఈ సమావేశం గురించి మొదట బయటపడింది. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ హోటల్‌కు తిరిగి వెళ్లిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విందు తర్వాత, ఎంఎస్ ధోని స్వయంగా తన ఎస్‌యూవీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని, పక్కన కోహ్లీని కూర్చోబెట్టుకుని టీమ్ హోటల్‌కు డ్రాప్ చేశాడు. ఈ వీడియోలో ఎలాంటి సెక్యూరిటీ హంగామా గానీ, ఫ్లాషీ ఎస్కార్ట్ గానీ లేకపోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.

పదేళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించిన ఈ ఇద్దరు దిగ్గజాల సుదీర్ఘ భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను రీ-యూనియన్ ఆఫ్ ది ఇయర్ అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. అభిమానులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వన్డే సిరీస్‌తో కోహ్లీ తిరిగి రాంచీలో మ్యాచ్ ఆడబోతున్నాడు. తన కుమారుడు అకాయ్ జననం కారణంగా ఫిబ్రవరి 2024లో రాంచీలో జరిగిన ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ను కోహ్లీ కోల్పోయాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై చివరిసారిగా అజేయంగా 74 పరుగులు చేసి జట్టు వైట్‌వాష్‌ను తప్పించాడు.

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా లేకపోవడంతో, కేఎల్ రాహుల్ కెప్టెన్‎గా వ్యవహరిస్తున్నారు. వన్డేల్లో తిరుగులేని రికార్డు (14,255 పరుగులు,51 సెంచరీలు) ఉన్న కోహ్లీ ఈ సిరీస్‌లో మూడో స్థానంలో ఆడనున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఈ వన్డే సిరీస్‌లో బలంగా పుంజుకోవాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోలెక్స్ వాచ్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే..!
రోలెక్స్ వాచ్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే..!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే