AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 Auction: మంధాన నుంచి షెఫాలీ వరకు.. వేలంలో రూ. 2 కోట్లు అందుకోనున్న ప్లేయర్లు వీరే.. రూల్స్, పర్స్ వివరాలు ఇవే..

Women's Premier League: మహిళల ప్రీమియర్ లీగ్‌ వేలంలో స్మృతి, షఫాలీ, హర్మన్‌ప్రీత్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు రూ. 1.25 నుంచి 2 కోట్ల వరకు సంపాదించేందుకు సిద్ధంగా ఉన్నారు.

WPL 2023 Auction: మంధాన నుంచి షెఫాలీ వరకు.. వేలంలో రూ. 2 కోట్లు అందుకోనున్న ప్లేయర్లు వీరే.. రూల్స్, పర్స్ వివరాలు ఇవే..
Wpl 2023
Venkata Chari
|

Updated on: Feb 13, 2023 | 10:22 AM

Share

నేడు అంటే సోమవారం మహిళల ప్రీమియర్ లీగ్ వేలం మొదలుకానుంది. ఈ లిస్టులో స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, టీనేజ్ సంచలనం షఫాలీ వర్మలు వేలంలో అధిక ధరను అందుకోనున్నారు. అలాగే ఓవర్సీస్ పేర్లలో అలిస్సా హీలీ, బెత్ మూనీ, ఎలిస్సే పెర్రీ, నాట్ స్కివర్, మేగాన్ షుట్, డియాండ్రా డాటిన్‌లు అధిక మొత్తంలో అందుకునే అవకాశం ఉంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు 409 మంది ప్లేయర్ల కోసం పోటీపడనున్నాయి. మొత్తంగా ఈ జాబితాలో 90 మంది ఆటగాళ్లను వేలంలో కొననున్నారు. మొదటి సంవత్సరానికి ఒక్కో జట్టుకు రూ. 12 కోట్ల పర్స్ కేటాయించారు. ఇక స్క్వాడ్ పరిమాణంతో ఆరుగురు విదేశీ ఆటగాళ్ళతో సహా 18 మంది, 60 మంది భారతీయ మహిళలలో కనీసం 20 నుంచి 25 మందిని ఎంపిక చేయనున్నారు.

కనీస ధర రూ. 10 లక్షలు కాగా, అత్యధికంగా రూ. 50 లక్షలతో ఐదు బ్రాకెట్లలో బేస్ ధరలు నిర్ణయించారు. ఇతర బ్రాకెట్లు వరుసగా రూ. 20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలుగా ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులోని సభ్యులు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు చెందిన వారు వేలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాళ్లుగా ఉంటారని అంతా భావిస్తున్నారు.

ఈ వేలంలో స్మృతి, షఫాలీ, హర్మన్‌ప్రీత్, ఆల్ రౌండర్ దీప్తి శర్మల కోసం ఫ్రాంచైజీలు రూ. 1.25 నుంచి రూ. 2 కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. బిగ్ హిట్టర్ రిచా ఘోష్, సీమర్ రేణుకా ఠాకూర్ కూడా ఈ లిస్టులో చేరే అవకాశం ఉంది. రాజేశ్వరి గయాక్వాడ్, రాధా యాదవ్, సీమర్లు మేఘనా సింగ్, శిఖా పాండే వంటి స్పిన్నర్లు కూడా అత్యధికంగా డబ్బు అందుకునే అవకాశం ఉంది. విదేశీ టీ20 లీగ్‌లలో రాణించిన జెమిమా రోడ్రిగ్స్ కూడా వేలంలో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వేలానికి సంబంధించి కీలక విషయాలు..

జట్లు: 5

ఫ్రాంచైజీల పేర్లు: ఢిల్లీ, ముంబై, ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్

కనీస వేతనం తప్పనిసరి : రూ. 9 కోట్లు

గరిష్ట జీతం పర్స్/టీమ్: రూ. 12 కోట్లు

కనీస స్క్వాడ్ బలం తప్పనిసరి: 15

గరిష్ట స్క్వాడ్ బలం: 18

జట్టులో గరిష్ట భారత ఆటగాళ్లు: 12

గరిష్ట విదేశీ ఆటగాళ్లు/జట్టు: 6

అందుబాటులో ఉన్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 409

వేలానికి భారత ఆటగాళ్లు: 246

పూర్తి సభ్యుల నుంచి విదేశీ ఆటగాళ్ళు: 155

అసోసియేట్ నేషన్స్ నుంచి ఆటగాళ్ళు: 8

వేలం వేసిన వ్యక్తి పేరు: మాలిక సాగర్

గమనిక: ఐదవ ఆటగాడు అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్ అయితే, ఒక జట్టు ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ప్లేయింగ్ XIలో ఉంచవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే