అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ కోసం కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ప్రపంచ క్రికెట్‌లోని ఎందరో దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్, ఇయాన్ బిషప్ వంటి ప్రముఖుల మాటలు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్ మైదానాల్లో వినిపించనున్నాయి. ఈ దిగ్గజాల జాబితాను విడుదల చేయడంతో పాటు ఈ ప్రపంచకప్‌లో ఎవరు ఏ విభాగంలో వ్యాఖ్యానిస్తారో కూడా ఐసీసీ స్పష్టం చేసింది. ఐసిసి విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐసీసీ టీవీలో కామెంటేటరీ చేయనున్నారు. ఐసీసీ టీవీ వ్యాఖ్యానంలో ప్రీ-మ్యాచ్, ఇన్నింగ్స్ విరామం, మ్యాచ్ తర్వాత చర్చలు ఉంటాయి. పాంటింగ్, మోర్గాన్‌లతో పాటు షేన్ వాట్సన్, లిసా స్థలేకర్, రమీజ్ రాజా, రవిశాస్త్రి, ఆరోన్ ఫించ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్ కూడా ఐసీసీ టీవీ కామెంటేటర్ల లిస్టులో ఉన్నారు.
నాసిర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్ కామెంటరీ బాక్స్‌లో ఉంటారు. గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్‌లో ముగ్గురు దిగ్గజాలు కూడా కామెంటరీ రూమ్‌లో ఉన్నారు. వీరితో పాటు వకార్ యూనిస్, షాన్ పోలాక్, అంజుమ్ చోప్రా, మైఖేల్ ఆర్థర్టన్‌లు కామెంటరీ బాక్స్‌లో కనిపించనున్నారు. ఇంకా సైమన్ డైల్, మ్పుమెలెలో బంగ్వా, సంజయ్ మంజ్రేకర్, కాటి మార్టిన్, దినేష్ కార్తీక్, డిర్క్ జానక్, శామ్యూల్ బద్రీ, రస్సెల్ ఆర్నాల్డ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరితో పాటు హర్ష్ భోగ్లే, కాస్ నైడూ, మార్క్ నికోల్స్, నటాలీ జర్మనోస్, మార్క్ హోవార్డ్, ఇయాన్ వార్డ్‌ల కామెంటేటరీని కూడా వినొచ్చు.
రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, అంజుమ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, దినేష్ కార్తీక్, హర్ష భోగ్లే, కె శ్రీకాంత్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, ఎస్ శ్రీశాంత్, ఎంఎస్‌కే ప్రసాద్, సందీప్ పాటిల్, సునీల్ జోషి, మిథాలీ రాజ్.
రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, లిసా స్టాహ్లాకర్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, మార్క్ నికోలస్, డిర్క్ నానెస్, మార్క్ హోవార్డ్.
ఇంగ్లండ్: ఇయాన్ మోర్గాన్, నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్, ఇయాన్ వార్డ్
న్యూజిలాండ్: ఇయాన్ స్మిత్, సైమన్ డౌల్, కేటీ మార్టిన్
వెస్టిండీస్: ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ
దక్షిణాఫ్రికా: షాన్ పొలాక్, కాస్ నైడూ, నటాలీ జర్మనోస్
జింబాబ్వే: Mpumelelo Mbangwa
శ్రీలంక: రస్సెల్ ఆర్నాల్డ్
ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాలరావు, మిథాలీరాజ్, ఆర్జే శశి, యాంకర్ రవి, నందు, టి.సుమన్, ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర రావు, రాకేష్ దేవా, ఎన్ సీ కౌషిక్, వింధ్య
𝕊𝕦𝕡𝕖𝕣 𝕊𝕥𝕒𝕣 ℂ𝕒𝕤𝕥 – 𝕊𝕥𝕒𝕣 𝕊𝕡𝕠𝕣𝕥𝕤 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 💥😎
ఈ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 🏆 లో మన #StarSportsTelugu స్టార్ కాస్ట్ వీరే.!! 😍
చూడండి 👀
ICC Men’s Cricket World Cup 2023
మీ #StarSportsTelugu & Disney+ Hotstar లో#WorldCupOnStar pic.twitter.com/VngCuabhne— StarSportsTelugu (@StarSportsTel) September 29, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..