IND vs PAK World Cup 2023: మనదే పైచేయి అయినా.. ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌-2023లో హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్‌ 14)న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఈ హై టెన్షన్‌ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రాక్టీస్‌ను కూడా ముమ్మరం చేశాయి. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి.

IND vs PAK World Cup 2023: మనదే పైచేయి అయినా.. ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?
India Vs Pakistan

Updated on: Oct 13, 2023 | 1:25 PM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌-2023లో హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్‌ 14)న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఈ హై టెన్షన్‌ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రాక్టీస్‌ను కూడా ముమ్మరం చేశాయి. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు దూకుడు మీద ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. హ్యాట్రిక్‌ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ జట్లు మొదటి సారిగా ఎప్పుడు తలపడ్డాయి? దాయాదుల పోరులో ఎవదిది పై చేయి? హెడ్‌ టు హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఇక స్వదేశంలో భారత్ 11 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ 17 మ్యాచ్‌లు గెలిచింది. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు చివరిగా ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ లో తల పడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఓవరాల్‌గా వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ దే పైచేయి అయినా వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం ఆ జట్టుకు భారత్‌పై చెత్త రికార్డు ఉంది.

వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు 7 సార్లు తలపడగా.. టీమిండియానే 7 సార్లు విజయం సాధించింది. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా పాకిస్తాన్‌ను చిత్తు చేయాలని టీమిండియా ధీమాతో ఉంది. మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం ఈసారైనా టీమిండియాను ఓడించి లెక్కలు సరిచేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక చివరగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019లో దాయాది జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(140) మెరుపు సెంచరీతో తలపడగా.. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్‌ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన దశలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం 89 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ 29 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయ ఢంకా మోగించింది.

ఇవి కూడా చదవండి

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం.

టీమిండియా ప్రాక్టీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..