AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థానీ ఫ్యాన్‌కు టిక్కెట్లు పంపిన ధోని!

భారత మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ధోని ఆటతీరు, అతడి ప్రవర్తన చూసి ఎంతోమంది అభిమానులు ధోనిని ఆరాధిస్తారు. ఇకపోతే ఆయనకు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మహమ్మద్ బషీర్.. ధోనికి వీరాభిమాని. అతడికి, ధోనికి మధ్య స్నేహం 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి ప్రారంభమైంది. బషీర్ తాజాగా ఆదివారం జరిగే భారత్- పాక్ […]

పాకిస్థానీ ఫ్యాన్‌కు టిక్కెట్లు పంపిన ధోని!
Ravi Kiran
|

Updated on: Jun 15, 2019 | 1:36 PM

Share

భారత మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ధోని ఆటతీరు, అతడి ప్రవర్తన చూసి ఎంతోమంది అభిమానులు ధోనిని ఆరాధిస్తారు. ఇకపోతే ఆయనకు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మహమ్మద్ బషీర్.. ధోనికి వీరాభిమాని. అతడికి, ధోనికి మధ్య స్నేహం 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి ప్రారంభమైంది. బషీర్ తాజాగా ఆదివారం జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం చికాగో నుంచి మాంచెస్టర్ వచ్చాడు. అయితే అతని దగ్గర మ్యాచ్ వీక్షించడానికి టికెట్ లేదు. కానీ తనకోసం ధోని తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకంతో మాంచెస్టర్‌కు చేరుకున్నాడట. సరిగ్గా ఆయన అనుకున్నట్లే కెప్టెన్ కూల్.. అతనికి కష్టం కలగకుండా మ్యాచ్ టికెట్ పంపించాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బషీర్ ‘నేను మాంచెస్టర్ నిన్నే వచ్చానని అన్నాడు. ప్రతీ ఒక్కరు టికెట్ కోసం 800-900 పౌండ్లు ఖర్చు చేయడం చూశాను.. కానీ నాకు తిరిగి చికాగో వెళ్ళడానికి కూడా ఆంటే ఖర్చు అవుతుంది. అలాంటి తరుణంలో నేను కష్టపడకుండా.. మ్యాచ్‌ను వీక్షించడానికి సహాయం చేసిన ధోనికి నా కృతఙ్ఞతలు’ అని బషీర్ అన్నాడు.

‘నేను ఎప్పుడూ ధోనికి ఫోన్ చేయను. కేవలం వీలు దొరికినప్పుడల్లా మెసేజ్‌లు పెడుతూ అతనితో టచ్‌లో ఉంటానని’ బషీర్ తెలిపాడు. నేనిక్కడికి రాకముందే మ్యాచ్ టికెట్ గురించి ధోని నాకు హామీ ఇచ్చాడని ఆయన చెప్పారు. ఇక ఈ చికాగో చాచాని ఎప్పుడూ నిరాశపరచని ధోనికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్