AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup Viewership : రికార్డుల మోత మోగించిన వరల్డ్ కప్ ఫైనల్.. గత మూడు వరల్డ్ కప్‌ల మొత్తం కంటే ఎక్కువ వ్యూయర్‌షిప్!

భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను తొలిసారి గెలుచుకుంది. ఈ చారిత్రక విజయం మైదానంలోనే కాదు, వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌ను చూసిన ప్రేక్షకుల సంఖ్య, ఏకంగా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు దాదాపు సమానంగా ఉండటం విశేషం.

World Cup Viewership : రికార్డుల మోత మోగించిన వరల్డ్ కప్ ఫైనల్.. గత మూడు వరల్డ్ కప్‌ల మొత్తం కంటే ఎక్కువ వ్యూయర్‌షిప్!
World Cup
Rakesh
|

Updated on: Nov 07, 2025 | 6:04 PM

Share

World Cup Viewership : భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను తొలిసారి గెలుచుకుంది. ఈ చారిత్రక విజయం మైదానంలోనే కాదు, వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌ను చూసిన ప్రేక్షకుల సంఖ్య, ఏకంగా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు దాదాపు సమానంగా ఉండటం విశేషం. మహిళల క్రికెట్ భారతదేశంలో ఎంతగా ఆదరణ పొందుతుందో

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ వ్యూయర్ల సంఖ్య పరంగా భారతదేశంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఫైనల్‌లో భారత జట్టు చారిత్రక విజయం సాధించినప్పుడు కోట్ల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫారంలో 185 మిలియన్ల (18.5 కోట్లు) మంది యూజర్లు వీక్షించారు. ఈ సంఖ్య ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ వీక్షకుల సంఖ్యకు దాదాపు సమానం కావడం విశేషం.

మొత్తం టోర్నమెంట్‌కు 446 మిలియన్ల (44.6 కోట్లు) మంది వీక్షకులను చేరుకున్నట్లుగా రికార్డ్ అయింది. ఇది మహిళల క్రికెట్‌కు అత్యధిక రీచ్. గత మూడు ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ల మొత్తం వీక్షకుల సంఖ్య కంటే కూడా ఇది ఎక్కువ. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జియో హాట్‌స్టార్‌లో అత్యధికంగా వీక్షించిన సంఖ్య మరో రికార్డు సృష్టించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిచిన మొట్టమొదటి ఆసియా జట్టుగా అవతరించిన క్షణంలో ఒకేసారి అత్యధికంగా 21 మిలియన్ల (2.1 కోట్లు) మంది వీక్షకులు ఫైనల్‌ను చూశారు. కనెక్టెడ్ టీవీలలో (స్మార్ట్ టీవీల్లో) ఈ చారిత్రక మ్యాచ్‌ను చూసిన వీక్షకుల సంఖ్య 9.2 కోట్లు. ఇది కూడా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లకు వచ్చిన CTV వీక్షకుల సంఖ్యకు దాదాపు సమానంగా ఉంది. ఇది వ్యూయర్ల అలవాట్లలో వస్తున్న మార్పును సూచిస్తుంది.

ఈ రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్ ద్వారా భారతీయ క్రీడా రంగంలో మహిళల క్రికెట్ పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తుంది. మహిళల క్రికెట్ ఇప్పుడు కేవలం చూడడం మాత్రమే కాదు.. ఆ విజయాలను లక్షలాది మంది ప్రజలు ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఈ విజయం భవిష్యత్తులో ఆటగాళ్లకు, అభిమానులకు, బ్రాండ్‌లకు స్ఫూర్తినిస్తుందని జియో హాట్‌స్టార్ సీఈఓ ఇషాన్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత