AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup 2026: ఇదెక్కడి క్రేజ్ మావ.. టోర్నీ ఆరంభానికి ముందే అన్ని లక్షలు టిక్కెట్లు అమ్ముడయ్యాయా?

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడవడంతో మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ స్పష్టమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Women’s T20 World Cup 2026: ఇదెక్కడి క్రేజ్ మావ.. టోర్నీ ఆరంభానికి ముందే అన్ని లక్షలు టిక్కెట్లు అమ్ముడయ్యాయా?
Women's T20 World Cup 2026
SN Pasha
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 4:57 PM

Share

మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 టికెట్ విక్రయాలే నిదర్శనంగా నిలిచాయి. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి ముందుగానే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడవ్వడం కొత్త రికార్డుగా నమోదైంది. మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టోర్నీ ప్రారంభానికి ముందే ఇంత భారీ స్థాయిలో టికెట్లు విక్రయమైన సందర్భం ఇదే మొదటిసారి.

టోర్నీ ప్రారంభానికి ఐదు రోజుల ముందే ఐసీసీ ప్రత్యేకంగా కెప్టెన్ల ఫొటోషూట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొంటున్న 12 దేశాల జట్ల కెప్టెన్లు హాజరై వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళల క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి భవిష్యత్తులో ఈ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఐసీసీ డైరెక్టర్, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.

జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడనున్నాయి. 33 మ్యాచ్‌లు జరగనున్న ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్ జూలై తొలి వారంలో, ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్ మైదానంలో నిర్వహించనున్నారు. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా, గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.

టీమిండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?

భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌ను ఎదుర్కొననుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?