
ACC Trophy Controversy: గతేడాది అంటే 2025లో యూఏఈలోనే జరిగిన పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. అంతకుముందు ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఆ మ్యాచ్‌లలో స్పష్టంగా కనిపించింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ ప్రతినిధి మొహ్సిన్ నఖ్వీ చేతుల నుంచి ట్రోఫీని స్వీకరించేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. ఆ సమయంలో ట్రోఫీని నఖ్వీ తన వెంట హోటల్‌కు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. ఆ ట్రోఫీ ఇప్పటివరకు భారత జట్టుకు అందలేదనే విషయం బోర్డు వర్గాల్లో ఇంకా సద్దుమణగలేదు.
తాజా మహిళల ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ భారత మహిళా జట్టు ఫైనల్ చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హర్మన్‌ప్రీత్ సేన ట్రోఫీ సాధిస్తే బహుమతి ప్రదానోత్సవంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది.
గత సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు బీసీసీఐ ఎలాంటి ముందస్తు ప్రణాళికలు రచిస్తుందో చూడాలి. ఒకవేళ నఖ్వీ స్వయంగా వేదికపైకి వస్తే భారత క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా మారింది.
ఎక్కువమంది చదివినది: SL vs IND: 7 ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?
మైదానంలో మ్యాచ్‌ల కంటే కూడా వేదిక వెలుపల జరిగే పరిణామాలే ఇప్పుడు టోర్నీ ఆరంభానికి ముందే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత జట్టు విజయవంతంగా ట్రోఫీని కైవసం చేసుకుని గత వివాదాలకు ముగింపు పలుకుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..