IND vs PAK: టోర్నీ ఏదైనా.. టీమిండియాదే ఆధిపత్యం.. ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ రికార్డులు..

|

Jul 18, 2024 | 5:16 PM

Womens Asia Cup 2024: టీ20 వరల్డ్ తర్వాత, మహిళల ఆసియా కప్ జులై 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్. 2022 ఫైనల్లో శ్రీలంకను ఓడించింది. ఇప్పుడు జులై 19న పాకిస్థాన్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్‌ రికార్డు ఏమిటో తెలుసుకుందాం.

IND vs PAK: టోర్నీ ఏదైనా.. టీమిండియాదే ఆధిపత్యం.. ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ రికార్డులు..
Ind W Vs Pak W Asia Cup 2024
Follow us on

Womens Asia Cup T20, IND vs PAK: పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్ అయినా.. భారత్-పాకిస్థాన్ విషయానికి వస్తే, ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. మహిళల ఆసియా కప్ జులై 19 నుంచి శ్రీలంకలో ప్రారంభం కానుంది. అదే రోజున దంబుల్లాలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ద టోర్నమెంట్‌లలో భారత పురుషుల జట్టు ఎప్పుడూ పాకిస్థాన్‌ కంటే మెరుగ్గా ఉంటుంది. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుపై భారత పురుషుల జట్టు విజయం సాధించింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. అయితే, అంతకు ముందు ఇరు జట్లు ఒకరిపై ఒకరు సాధించిన రికార్డులను తెలుసుకోవడం ముఖ్యం.

టీ20లో భారత్ వర్సెస్ పాకిస్థాన్..

మహిళల ఆసియా కప్ 2024 టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అందుకే టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌-పాక్‌ల రికార్డు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టీ20లో ఇరు దేశాలు 14 మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో చాలా సందర్భాలలో భారతీయ అమ్మాయిలే విజయం సాధించారు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో టీమిండియా 11 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్థాన్ 3 మాత్రమే గెలిచింది. టీ20లో పాకిస్థాన్‌పై భారత్ విజయాల శాతం 78.57 శాతం కాగా, పాకిస్థాన్ జట్టు విజయ శాతం 21.42 శాతం మాత్రమే.

ఆసియాకప్‌లోనూ భారత్‌దే పైచేయి..

సాధారణ టీ20 మ్యాచ్‌ల్లోనే కాకుండా ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్ జట్టుపై టీమ్ ఇండియా ఎప్పుడూ పైచేయి సాధించింది. 2012 నుంచి 2022 మధ్య అంటే గత 10 ఏళ్లలో ఈ టోర్నీలో ఇరు జట్లు 6 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత జట్టు పాకిస్థాన్‌ను 5 సార్లు ఓడించగా, 2022లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. మహిళల ఆసియా కప్‌లో 9 ఎడిషన్లలో, టీమ్ ఇండియా 8 సార్లు టోర్నమెంట్‌ను గెలుచుకున్న విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చివరిసారి అంటే 2022లో శ్రీలంక ఫైనల్‌లో ఓడి ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

మహిళల ఆసియా కప్ షెడ్యూల్..

రెండు గ్రూపులుగా విభజించిన మహిళల ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్‌లతో పాటు యూఏఈ, నేపాల్‌లు గ్రూప్‌ ఏలో ఉన్నాయి. మరోవైపు గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 26న జరిగే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జులై 28న జరగనుంది.

పూర్తి షెడ్యూల్..

జూలై 19- UAE vs నేపాల్ (మధ్యాహ్నం 2 గంటలకు)

ఇండియా-పాకిస్థాన్ (రాత్రి 7 గంటలకు)

జూలై 20- మలేషియా vs థాయ్‌లాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)

శ్రీలంక vs బంగ్లాదేశ్ (రాత్రి 7 గంటలకు)

జూలై 21- భారతదేశం vs UAE (మధ్యాహ్నం 2 గంటలకు)

పాకిస్థాన్ vs నేపాల్ (రాత్రి 7 గంటలకు)

జూలై 22- శ్రీలంక vs మలేషియా (మధ్యాహ్నం 2 గంటలకు)

బంగ్లాదేశ్ vs థాయ్‌లాండ్ (రాత్రి 7 గంటలకు)

జూలై 23- పాకిస్థాన్ vs UAE (మధ్యాహ్నం 2 గంటలకు)

భారత్ vs నేపాల్ (రాత్రి 7 గంటలకు)

జూలై 24- బంగ్లాదేశ్ vs మలేషియా (మధ్యాహ్నం 2 గంటలకు)

శ్రీలంక vs థాయిలాండ్ (రాత్రి 7 గంటలకు)

జూలై 26- సెమీఫైనల్ 1 (మధ్యాహ్నం 2 గంటలకు)

సెమీ-ఫైనల్ 2 (రాత్రి 7 గంటలకు)

28 జూలై – ఫైనల్ (రాత్రి 7 గంటలకు)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..