శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ ఫైనల్ 2024లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ట్రోఫీని గెలుచుకుంది. శ్రీలంక ఆసియా కప్‌ను గెలవడం ఇదే తొలిసారి. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (జులై 28) జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. స్మృతి మంధాన అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. భారత్ విధించిన 166 పరుగుల విజయ లక్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అతపతు, హర్షిత సమరవిక్రమ ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. దీంతో శ్రీలంక అలవోకగా విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మితిమీరిన ఆత్మవిశ్వాసం, పేలవమైన నాయకత్వం, సులువైన క్యాచ్‌లు, పేలవమైన బౌలింగ్ వంటివి భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. భారత్, బంగ్లాదేశ్ తర్వాత ఆసియా కప్ గెలిచిన మూడో మహిళల జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది.
మహిళల ఆసియా కప్ టోర్నీ 2004 నుంచి జరుగుతోంది. ఈ ఏడాది ఇది 8వ పోటీ. ఈ టోర్నీ చరిత్రలో శ్రీలంక 5 సార్లు ఫైనల్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. టీం ఇండియా మొత్తం ఐదుసార్లు శ్రీలంకను ఓడించింది. అయితే ఈ ఏడాది శ్రీలంక 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆసియా కప్ విజయం కోసం శ్రీలంక 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ఈ విజయంతో ముగిసింది. కాగా గతేడాది జరిగిన మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసింది.
#TeamIndia fought hard, but it was Sri Lanka who won the match by 8 wickets.
Scorecard ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final pic.twitter.com/YtZMot6dvr
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రి, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్ మరియు రేణుకా ఠాకూర్ సింగ్.
చమరి అతపతు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), హాసిని పెరీరా, సుగంధికా కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధని, సశిక ప్రబోధని.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..