Watch Video: బౌన్సర్‌తో షాకిచ్చిన బౌలర్.. స్మాషింగ్ షాట్‌తో మిస్టర్ 360 రివర్స్ కౌంటర్.. వైరల్ వీడియో..
Surya Kumar Yadav: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 172 కంటే ఎక్కువగా ఉంది.
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో రెండో టీ20లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని కూడా సొంతం చేసుకుంది. కానీ, వీటన్నింటి మధ్య మ్యాచ్‌లో కొన్ని అద్భుత క్షణాలు కనిపించాయి. అందులో ఒకటి సూర్యకుమార్ సూపర్ షాట్ కూడా ఒకటి. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్, అభిమానులకు ఎంతో మజాను అందించింది. అల్జారీ తన బౌన్సర్‌తో సూర్యకుమార్ యాదవ్ ముఖంపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భారత బ్యాట్స్‌మెన్ స్పందించిన తీరుపై, నెటిజన్లు కామెంట్లతో తమ సంతోషాలను పంచుకుంటున్నారు. బౌలర్ మనోభావాలను ఎలా దెబ్బతీయాలో సూర్యకు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇలాంటి షాట్లు, ఎక్కడ నేర్చుకున్నావ్ బ్రదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 172 కంటే ఎక్కువగా ఉంది. అతను తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఇది జట్టు విజయానికి పునాదిగా నిలిచింది.
భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో..
భారత్, వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ 61 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఈ సమయంలో భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ కొనసాగుతోంది. దీంతో బౌలర్లు కాస్త అసహనంగా కనిపించారు. ఈ క్రమంలో బౌలర్ అల్జారీ జోసెఫ్ తన బౌలింగ్‌తో సూర్యను ఇబ్బంది పెట్టాలని చూశాడు. అతను ఈ ఓవర్‌లోని చివరి బంతిని బౌన్సర్‌తో దాడి చేశాడు.
How good was that shot from @surya_14kumar? Let us know in the comments.
Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode ? https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/ym1JkZjb1r
— FanCode (@FanCode) August 2, 2022
స్మాషింగ్ బౌన్సర్‌కి స్మార్ట్ రిప్లై..
అలార్జీ సంధించిన బౌన్సర్‌ను సూర్య తనదైన శైలిలో వింత షాట్ ఆడాడు. దానిపై బంతి బౌండరీ లైన్‌కు చేరింది. సూర్యకుమార్ యాదవ్ షాట్ చూసినవారంతా షాక్ అయ్యారు. కామెంటేటర్లు కూడా ఆ షాట్‌ను ప్రశంసల జల్లులు కురిపించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..