BAN Vs WI: వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థత.. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడిన బంగ్లా క్రికెటర్లు.. కారణమేంటంటే..

| Edited By: Ravi Kiran

Jul 03, 2022 | 6:52 AM

BAN Vs WI: వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకున్నారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే..

BAN Vs WI: వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థత.. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడిన బంగ్లా క్రికెటర్లు.. కారణమేంటంటే..
Bangladesh Cricket Team
Follow us on

BAN Vs WI: వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకున్నారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లా క్రికెటర్లలో చాలామంది ఇప్పటివరకు సముద్ర ప్రయాణం చేయలేదట. దీంతో నౌక బయలుదేరగానే చాలామంది ఆటగాళ్లు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా షోరీఫుల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థత బారిన పడ్డారు. ఫెర్రీ (వ్యాపార నౌక) సముద్రం మధ్యలోకి చేరుకోగానే పెద్ద అలలు మొదలయ్యాయి. ఇది పెద్ద నౌక కాదు కాబట్టి, అలలు కారణంగా ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఫెర్రీ విపరీతంగా ఊగింది. దీంతో సముద్ర ప్రయాణం ఏ మాత్రం అలవాటు లేని గా క్రికెటర్లు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారని’ బంగ్లాదేశ్‌ పత్రికలు రాసుకొచ్చాయి.

ఆట గురించి మర్చిపోయాం..

కాగా విండీస్‌తోజరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఓటమిపాలైంది బంగ్లాదేశ్‌. ఈక్రమంలోనే శనివారం డొమినికాలో జరిగిన మొదటి టీ20 కోసం సెయింట్ లూసియా నుంచి నౌకలో బయలుదేరారు. ఈ సమయంలోనే వారికి చేదు అనుభవం ఎదురైంది. ‘నేను చాలా దేశాలు తిరిగాను. అయితే సముద్ర ప్రయాణం చేయడం ఇదే తొలి సారి. మాలో ఎవరికీ ఇలాంటి ప్రయాణాలు అలవాటు లేదు. జర్నీ సమయంలో మేము క్రికెట్‌ గురించి పూర్తిగా మర్చిపోయాం. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నాం. ఇది నా జీవితంలో అత్యంత చెత్త పర్యటన’ అని బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ఒకరు వాపోయాడు. కాగా ఎంతో కష్టపడి డొమినికాకు చేరుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మధ్యలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఆట నిలిచిపోయే సమయానికి బంగ్లా 13 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..