AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS Vs WI: 100 టెస్టులు ఆడినా వేస్ట్ ఫెలోనే.. 11 ఏళ్లలో తొలిసారి.. ఇదేం కర్మరా.!

వెస్టిండీస్ తరఫున వరుసగా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా క్రెయిగ్ బ్రాత్‌వైట్ నిలిచాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ వరుసగా 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఆ వివరాలు..

AUS Vs WI: 100 టెస్టులు ఆడినా వేస్ట్ ఫెలోనే.. 11 ఏళ్లలో తొలిసారి.. ఇదేం కర్మరా.!
Aus Vs Wi
Ravi Kiran
|

Updated on: Jul 14, 2025 | 11:52 AM

Share

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో.. వెస్టిండీస్ జట్టు తన అనుభవజ్ఞుడైన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌పై వేటు వేసింది. వెస్టిండీస్ తరపున వరుసగా 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా కూడా లాభం లేకపోయింది. మూడో మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. మొదటి రెండు టెస్ట్‌లలో బ్రాత్‌వైట్ పేలవమైన ఆటతీరు కనబరిచాడు. దీనితో అతడ్ని మూడో టెస్ట్‌లో వేటు వేశారు. వెస్టిండీస్ తరపున 90 టెస్ట్‌లు ఆడిన ఏకైక బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్. క్రెయిగ్ బ్రాత్‌వైట్ వరుసగా 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌కు అతడు తప్ప మరెవ్వరూ కూడా 90 టెస్ట్‌లు ఆడలేదు. ఈ జాబితాలో వెస్టిండీస్ తరపున వరుసగా 85 మ్యాచ్‌లు ఆడిన గొప్ప ఆల్ రౌండర్ సర్ గ్యారీ సోబర్స్ రెండో స్థానంలో ఉండగా.. లెజెండరీ ఓపెనర్ డెస్మండ్ హేన్స్ వరుసగా 72 మ్యాచ్‌లు.. బ్రియాన్ లారా వరుసగా 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

ఇదిలా ఉంటే క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఇటీవల వెస్టిండీస్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించాడు. బ్రాత్‌వైట్ 100 టెస్ట్ మ్యాచ్‌ల్లో 32.51 సగటుతో 5950 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 212 పరుగులు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్‌లలోనూ 4, 4, 0, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌ను 159 పరుగుల తేడాతో గెలుచుకోగా, రెండవ టెస్ట్‌లో 133 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..