AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ కొట్టినా, వద్దని దూరం పెట్టినా.. ఆ ఇద్దరు అసలెందురు రిటైర్మెంట్ చేయడం లేదు.? అసలు కారణం ఇదే!

Rohit Sharma: రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్‌పై కొనసాగుతున్న చర్చకు ఓ మీడియా రిపోర్టు ఆసక్తికర కారణాన్ని వెల్లడించింది. అయితే ఈ వాదనకు ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ లేదు. రోహిత్ 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

ఛీ కొట్టినా, వద్దని దూరం పెట్టినా.. ఆ ఇద్దరు అసలెందురు రిటైర్మెంట్ చేయడం లేదు.? అసలు కారణం ఇదే!
Team India Players
Venkata Chari
|

Updated on: Sep 04, 2026 | 12:25 PM

Share

టీమిండియా సీనియర్ ప్లేయర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ ఫ్యూచర్‌పై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంకా రిటైర్మెంట్ చెప్పలేదు. ఇప్పటికే వీడ్కోలు చెప్పాల్సిన వీళ్లిద్దరు ఇంతవరకు ఎందుకు అటువంటి ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం ఇదే ప్రశ్న నెటిజన్లను కూడా వేధిస్తోంది. బీసీసీఐ వద్దని దూరం పెట్టినా, ఏ సిరీస్‌కు వీరిని ఎంపిక చేయకపోయానా సరే, వీళ్లు మాత్రం రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకోలేదు. మరి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా ఓ మీడియా రిపోర్ట్ మేరకు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే ఐపీఎల్ ఛాన్స్ లు, బ్రాండ్ ఒప్పందాలతోపాటు ఇతర వాణిజ్య అవకాశాలపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్లే భారత జట్టు నుంచి ఇంకా తప్పుకోలేదని అంటున్నారు.

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ పర్యటన సమయంలో అతడి రిటైర్మెంట్‌పై భారీ ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడనే ప్రచారం జరిగింది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ అద్భుత శతకం సాధించి, ఆ వార్తలను కొట్టిపారేశాడు. తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. రోహిత్ ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నాడని, 2027 వన్డే ప్రపంచకప్‌నకు అతడు ఇంకా భారత జట్టు ప్రణాళికల్లో ఉన్నాడని స్పష్టం చేయడం గమనార్హం.

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

ఇవి కూడా చదవండి

మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌కు మాత్రం చాలా కాలంగా భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో తమ సత్తా చాటుతూ రీఎంట్రీపై ఆశలు కొనసాగిస్తున్నారు. ఇటీవల షమీ దులీప్ ట్రోఫీలో 900 ప్రొఫెషనల్ వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయం వారి వ్యక్తిగత భవిష్యత్తు, జాతీయ జట్టులో అవకాశాలు, ఐపీఎల్‌తో పాటు ఇతర వాణిజ్య అంశాలతో ముడిపడి ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ లేదా బ్రాండ్ డీల్స్ కారణంగానే వారు రిటైర్మెంట్ ప్రకటించడం లేదని నిర్ధారించే అధికారిక సమాచారం ప్రస్తుతం లేదు.

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us