Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!
Yuzvendra Chahal Magic Ball: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టిన టీమిండియా బ్యాడ్ లక్ ప్లేయర్.. ఏకంగా ఇంగ్లాండ్ తోపు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను బోల్తా కొట్టించి షాకిచ్చాడు. ఈ అద్భుత డెలివరీ వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, నెట్టింట్లో దూసుకెళ్తోంది.

Yuzvendra Chahal Magic Ball Video: టీమిండియా లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంటున్నాడు. నార్తాంప్టన్‌షైర్ తరపున డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి తన టీంను ఆధిక్యంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. చాహల్ తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చాడు. మ్యాచ్ మొత్తంలో ఈ వికెట్ హైలెట్‌గా నిలిచింది. ఆఫ్‌సైడ్ నుంచి దూసుకొచ్చిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగి స్టోక్స్ బ్యాట్‌ను దాటుకుని నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. ఈ బంతికి సంబంధించిన వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాహల్ బౌలింగ్‌కు స్టోక్స్ మాత్రమే కాకుండా అలెక్స్ లీస్, కేసీ ఆల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్ కూడా బలవ్వడం గమనార్హం. చాహల్ 4 వికెట్ల ప్రదర్శనతో నార్తాంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగుల ఆధిక్యం సాధించింది.
స్టోక్స్‌కు షాకిచ్చిన మ్యాజిక్ బాల్..
స్టోక్స్‌ను అవుట్ చేసిన బంతి ఆఫ్‌సైడ్ వెలుపల నుంచి వచ్చి లాస్ట్ మినిట్‌లో ఊహించని విధంగా మలుపు తిరిగింది. దాంతో బ్యాటర్‌కు స్పందించే అవకాశం లేకపోయింది. దీంతో బంతి వికెట్లను పడగొట్టి, మైదానంలో ఉన్న వారందరికీ షాకిచ్చింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ డెలివరీని “సెన్సేషనల్”గా పేర్కొంటూ వీడియోను పోస్ట్ చేసింది.
చాహల్ బౌలింగ్ వీడియో..
That is sensational pic.twitter.com/ChwDk7JfLR
— Rothesay County Championship (@CountyChamp) September 3, 2026
చాహల్‌తో పాటు పలువురు భారత క్రికెటర్లు ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నారు. కుల్దీప్ యాదవ్, అఖిబ్ నబీ, రాహుల్ చాహర్ కూడా ఇందులో భాగమయ్యారు.
ఇటీవల భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బౌలర్ల జాబితాలో చాహల్‌కు నాలుగో స్థానం దక్కింది. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తర్వాత చాహల్‌ను అర్ష్‌దీప్ ఎంపిక చేయడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
