RCB vs MI IPL 2022 Match Prediction: మొదటి విజయం కోసం ముంబై.. మూడో గెలుపు కోసం బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

RCB vs MI IPL 2022 Match Prediction: మొదటి విజయం కోసం ముంబై.. మూడో గెలుపు కోసం బెంగళూరు.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..
Rcb Vs Mi

Royal Challengers Bangalore vs Mumbai Indians Match Preview: ఐపీఎల్ 2022లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (CSK vs SRH) తలపడుతుండగా.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ (RCB vs MI) తలపడనున్నాయి

Basha Shek

| Edited By: Anil kumar poka

Apr 09, 2022 | 6:45 AM

Royal Challengers Bangalore vs Mumbai Indians Match Preview: ఐపీఎల్ 2022లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (CSK vs SRH) తలపడుతుండగా.. సాయంత్రం జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ (RCB vs MI) తలపడనున్నాయి. కాగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఆడిన మూడు మ్యాచ్‌ ల్లోనూ రోహిత్‌ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని రుచి చూడాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడినప్పటికీ, పటిష్ఠమైన కేకేఆర్‌, రాజస్థాన్ రాయల్స్‌ను బెంగళూరు మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు అడుగేయాలని ఆ జట్టు భావిస్తోంది.

బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

కాగా టోర్నీలో హ్యాట్రిక్‌ పరాజయాలను మూటగట్టుకున్న రోహిత్ సేన బెంగళూరును ఎదుర్కోవాలంటే శ్రమించక తప్పదు. ఒకరిద్దరు ఆటగాళ్లు కాకుండా బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో సమష్ఠిగా రాణించాల్సి ఉంది. ఇదే విషయాన్ని రోహిత్‌ శర్మ కూడా డ్రెస్సింగ్‌ రూంలో తన సహచరులకు చెప్పుకొచ్చాడు. ఇక ఆర్సీబీ బౌలింగ్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు డేవిడ్ విల్లీ, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ కూడా రాణిస్తున్నారు. ముంబై బ్యాటర్లను కట్టడి చేయాలంటే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ తన వంతు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక బెంగళూరుకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ఓపెనర్ అనూజ్ రావత్ రాణించలేకపోతున్నాడు. డు ప్లెసిస్, కోహ్లీ భారీస్కోర్లు చేయలేకపోతున్నారు. అయితే దినేశ్‌ కార్తిక్‌ సమర్థంగా ఫినిషర్ పాత్ర పోషిస్తుండడం ఆ జట్టుకు అదనపు సానుకూలాంశం. దీనికి తోడు హార్డ్‌ హిట్టర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌ జట్టులో చేరనుండడంతో ఆజట్టు నూతనోత్సాహంతో ఉంది.

ముంబైదే పైచేయి అయినా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి 31 సార్లు తలపడ్డాయి. ముంబై 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, గత సీజన్ గురించి మాట్లాడుకుంటే విరాట్ కోహ్లి సారథ్యంలోని RCBదే పైచేయి కనిపిస్తోంది. 14వ సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరే విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య IPL-2022 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఎక్కడ చూడొచ్చంటే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు జరగనుండగా, తొలి ఇన్నింగ్స్ 07:30కి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్క్రిప్షన్‌తో ఆన్‌లైన్‌లో మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇవి కాకుండా, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్‌ను tv9telugu.com ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, మహిపాల్ లోమోర్డ్, ఫిన్ రూథర్, షెర్ఫార్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సుయాష్ ప్రభుదేశాయ్, చామా మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, రజత్ పాటిదార్, సిద్ధార్థ్ కౌల్.

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్ , రిలే మెరెడిత్, తమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ , ఇషాన్ కిషన్.

Also Read: House Loan: మరింత కాలం చౌకగా హోమ్ లోన్స్.. RBI ప్రకటనతో రియల్టీ జోరు

Relationship: ఈ 3 విషయాలు తెలిస్తే భార్యాభర్తల మధ్య అస్సలు గొడవలు ఉండవు..!

Crime news: ప్రాణాలు తీసిన ఎయిర్ కండీషనర్.. ఇంట్లో నిద్రిస్తుండగా పేలుడు.. నలుగురు సజీవదహనం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu