CSK vs SRH Highlights, IPL 2022: వార్ వన్ సైడే.. 8 వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.. చెన్నైకు తప్పని మరో ఓటమి….

Venkata Chari

|

Updated on: Apr 09, 2022 | 7:19 PM

Chennai Super Kings vs Sunrisers Hyderabad Highlights in Telugu: 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ టీం.. 17.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

CSK vs SRH Highlights, IPL 2022: వార్ వన్ సైడే.. 8 వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.. చెన్నైకు తప్పని మరో ఓటమి....
Ipl 2022 Csk Vs Srh

Chennai Super Kings vs Sunrisers Hyderabad Highlights In Telugu: ఐపీఎల్‌లో ఈరోజు డబుల్ హెడర్‌లో భాగంగా, తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ టీం.. 17.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి(39 పరుగులు, 15 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు, 260 స్ట్రైక్ రేట్) కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2022లో హైదరాబాద్ టీం తొలి విజయాన్ని నమోదు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ టీం మాత్రం వరుసగా నాలుగోసారి ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లో బ్రావో, ముఖేష్ చౌదరి తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు చెన్నై టీంలో మొయిన్ అలీ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాయుడు 27, జడేజా 23 పరుగులు చేశారు. మిగతా వారంతా మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఇక బౌలింగ్‌లో నటరాజన్, సుందర్ తలో రెండు వికెట్లు, భువనేశ్వర్, జాన్సన్, ఐడెన్ మార్కాం తలో వికెట్ పడగొట్టారు. SRH బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ మరోసారి రెండు వికెట్లు తీశాడు. రాబిన్ ఉతప్ప (15), అంబటి రాయుడు (27)లను అవుట్ చేశాడు. ఉతప్ప, రాయుడు ఐడెన్ మార్క్రామ్‌కి క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుత టోర్నీలో సుందర్ 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.

ఇరుజట్లు..

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Key Events

చెన్నైదే ఆధిపత్యం

ఇప్పటి వరకు ఈ రెండు టీంల మధ్య జరిగిన 16 మ్యాచ్‌ల్లో సీఎస్కే 12, ఎస్‌ఆర్‌హెచ్ 4 మ్యా‌చ్‌ల్లో విజయం సాధించాయి.

వీరిద్దరిలో ఎవరు ఆకట్టుకుంటారో?

కేన్ విలియమ్సన్ CSKపై 10 ఇన్నింగ్స్‌లలో 338 పరుగులు చేయగా, అంబటి రాయుడు SRHపై 16 ఇన్నింగ్స్‌లలో 513 పరుగులు చేశాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 Apr 2022 07:06 PM (IST)

    తొలి విజయం సొంతం చేసుకున్న హైదరాబాద్..

    తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ టీం.. 17.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

  • 09 Apr 2022 06:31 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    చెన్నై బౌలర్లు ఎట్టకేలకు విజయం సాధించారు. కీలక భాగస్వామ్యంతో దూసుకెళ్తోన్న హైదరాబాద్ ఓపెనర్లను విడదీశారు. కేన్ విలియమ్సన్(32 పరుగులు, 40 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో హైదరాబాద్ తొలి వికెట్‌‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 89 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 06:27 PM (IST)

    అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ..

    అభిషేక్ శర్మ ఐపీఎల్‌లలో తన తొలి అర్థసెంచరీ పూర్తి చేశాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విలియమ్సన్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

  • 09 Apr 2022 06:10 PM (IST)

    9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    9 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 58 పరుగులు చేసింది. విలియమ్సన్ 23, అభిషేక్ శర్మ 39 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి 54 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. మరోవైపు వికెట్ల కోసం చెన్నై బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • 09 Apr 2022 06:00 PM (IST)

    6 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    6 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 37 పరుగులు చేసింది. విలియమ్సన్ 10, అభిషేక్ శర్మ 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి 36 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు.

  • 09 Apr 2022 05:48 PM (IST)

    3 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 14 పరుగులు చేసింది. విలియమ్సన్ 5, అభిషేక్ శర్మ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 05:24 PM (IST)

    హైదరాబాద్ టార్గెట్ 155

    చెన్నై టీం నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 155 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 09 Apr 2022 05:17 PM (IST)

    ఏడో వికెట్ డౌన్..

    జడేజా (25 పరుగులు, 15 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో చెన్నై టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 147 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 05:11 PM (IST)

    19 ఓవర్లకు చెన్నై స్కోర్..

    19 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. బ్రావో 3, జడేజా 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 05:05 PM (IST)

    ఆరో వికెట్ డౌన్..

    మహేంద్ర సింగ్ ధోనీ (3) రూపంలో చెన్నై టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. జాన్సన్ బౌలింగ్‌లో ఉమ్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 122 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 04:54 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    శివం దుబే (3) రూపంలో చెన్నై టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో ఉమ్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 110 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 04:49 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్..

    మొయిన్ అలీ (45 పరుగులు, 35 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో చెన్నై టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. మక్రాం బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 108 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 04:42 PM (IST)

    రాయుడు ఔట్..

    రాయుడు (27 పరుగులు, 27 బంతులు, 4 ఫోర్లు) రూపంలో చెన్నై టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో మాక్రాంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 98 పరుగులకు మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 04:36 PM (IST)

    13 ఓవర్లకు చెన్నై స్కోర్..

    13 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అలీ 39, రాయుడు 27 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి 47 బంతుల్లో 61 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు.

  • 09 Apr 2022 04:23 PM (IST)

    10 ఓవర్లకు చెన్నై స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అలీ 22, రాయుడు 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 04:10 PM (IST)

    8 ఓవర్లకు చెన్నై స్కోర్..

    8 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. అలీ 12, రాయుడు 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 04:01 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై స్కోర్..

    6 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. అలీ 9, రాయుడు 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్ టీం ఆధిక్యంలో నిలిచింది.

  • 09 Apr 2022 03:57 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    గైక్వాడ్ (16 పరుగులు, 13 బంతులు, 3 ఫోర్లు) రూపంలో చెన్నై టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 36 పరుగులకు రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 03:50 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో చెన్నై తుఫాన్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప(15) పరుగులకు పెవిలియన్ చేరాడు. మాక్రాంకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చెన్నై టీం 25 పరుగులకు తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 09 Apr 2022 03:42 PM (IST)

    2 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్..

    2 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం వికెట్ కోల్పోకుండా 16 పరుగులు చేసింది. గైక్వాడ్ 5, రాబిన్ ఊతప్ప 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 09 Apr 2022 03:09 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

    హైదరాబాద్ టీంలోకి కొత్తగా శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్ వచ్చారు.

  • 09 Apr 2022 03:09 PM (IST)

    చెన్నై జట్టు..

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

  • 09 Apr 2022 03:06 PM (IST)

    చెన్నైకి విజయం అవసరం..

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే ఈసారి చెన్నైకి పరిస్థితులు అంతగా అనుకూలించడంలేదు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన జడేజా సేన.. దీపార్ చాహర్‌ను కూడా కోల్పోయాడు. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం జట్టుకు చాలా కీలకంగా మారింది. లేదంటే టోర్నీలో ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.

    ప్రిట్రోరియస్ స్థానంలో మహేశ్ తీక్షణ జట్టులోకి వచ్చాడు.

  • 09 Apr 2022 03:01 PM (IST)

    టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

    ఐపీఎల్ 2022(IPL 2022)లో 17వ మ్యాచ్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య పోరు జరుగుతుంది. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 09 Apr 2022 02:41 PM (IST)

    పరాజయాల బాట వీడేదెవరో?

    ఐపీఎల్ 2022లో చెన్నై ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోగా, హైదరాబాద్ టీం రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం ఈ రెండు జట్లలో ఎవరిది కానుందో మరికొద్దిసేపట్లో తెలియనుంది. దీంతో వరుస పరాజయాలకు బ్రేక్ చెప్పనున్నారో ఈ రోజు తెలిసిపోనుంది.

  • 09 Apr 2022 02:38 PM (IST)

    మరికొద్దిసేపట్లో టాస్..

    ఐపీఎల్ 2022(IPL 2022)లో 17వ మ్యాచ్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని డాక్టర్ డీవై పాలిట్ స్పోర్ట్స్ అకాడమీ(Dr DY Patil Sports Academy, Mumbai )లో తలపడుతున్నాయి. ఈ మేరకు మరికొద్దిసేపట్లో టాస్ వేయనున్నారు.

Published On - Apr 09,2022 2:35 PM

Follow us
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!