AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌ 2022లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టు ఏదో తెలుసా..? భారీ సిక్స్ ఎవరు కొట్టారంటే..?

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో ఎన్నో రికార్డులు నమోదువుతోన్నాయి. ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్‌లో 7000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదీ ఒకే జట్టుకు ఆడుతూ ఈ ఘనత సాధించాడు....

IPL 2022: ఐపీఎల్‌ 2022లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టు ఏదో తెలుసా..? భారీ సిక్స్ ఎవరు కొట్టారంటే..?
Ipl 2022 Sixes
Srinivas Chekkilla
|

Updated on: May 23, 2022 | 1:07 PM

Share

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో ఎన్నో రికార్డులు నమోదువుతోన్నాయి. ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఐపీఎల్‌లో 7000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదీ ఒకే జట్టుకు ఆడుతూ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత సీనియర్‌ ఆటగాడు శిఖర్ దావన్(Shikar Dhawan) 6000 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో సన్‌రైజర్స్‌ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్(Umran Malik) ఈ సీజన్‌ అత్యంత వేగంగా బంతులు వేశాడు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లివింగ్‌స్టోన్‌(ఆటగాళ్లు అందరు కలిసి) సీజన్‌కు 1000వ సిక్స్‌ కొట్టాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 2022 ఐపీఎల్‌లో ఈ 1000వ సిక్స్ నమోదు అయింది. అలాగే ఈ సీజన్‌లో లివింగ్‌స్టోన్‌ భారీ సిక్సర్‌ కొట్టాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ సిక్స్‌ 117 మీటర్ల దూరం వెళ్లింది.

ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌-2022లో 1000 సిక్స్‌లు నమోదయ్యాయి. ఇందులో సంజు శాంసన్‌ నాయకత్వం వహిస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టింది. రాజస్థాన్‌ జట్టు 116 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 113 సిక్సర్లతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ రెండో స్థానంలో ఉంది. 110 సిక్స్‌లతో పంజాబ్‌ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. 106 సిక్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో స్థానంలో ఉండగా.. 103 సిక్సర్లతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5వ స్థానంలో ఉంది. 101 సిక్స్‌లతో లక్నో సూపర్ జెయింట్స్‌ 6వ స్థానంలో ఉంది. ముంబై(100), హైదరాబాద్‌(97), ఆర్సీబీ(86) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 69 సిక్స్‌లతో గుజరాత్‌ టైటాన్స్ చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి జోస్ బట్లర్ ఉన్నాడు. అతను 629 పరుగులు చేశాడు.

ఏ జట్టు ఎన్ని సిక్స్‌లు కొట్టిందంటే..

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్(RR)-116

కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR)-113

పంజాబ్‌ కింగ్స్‌(PBKS)-110

ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)-106

చెన్నై సూపర్‌ కింగ్స్(CSK)-103

లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)-101

ముంబై ఇండియన్స్‌(MI)-100

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)-97

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)-86

గుజరాత్‌ టైటాన్స్‌(GT)-69

మరిన్ని ఐపీఎల్‌ అప్‌డేట్స్‌కు ఇక్కడ క్లిక్ చేయండి..