AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh: వసీం అక్రం బౌలింగ్‌ చూసి నేర్చుకున్నాడు.. ఇప్పుడు టీమిండియాకు ఎంపికైయ్యాడు..

పంజాబ్‌ కింగ్స్‌(PBKS) జట్టులో సభ్యుడయ్యాడు. క్రమక్రమంగా మెరుగుపడుతూ కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు టీమిండియాకు ఎంపికయ్యాడు...

Arshdeep Singh: వసీం అక్రం బౌలింగ్‌ చూసి నేర్చుకున్నాడు.. ఇప్పుడు టీమిండియాకు ఎంపికైయ్యాడు..
Harshadeep Singh
Srinivas Chekkilla
|

Updated on: May 23, 2022 | 11:57 AM

Share

పంజాబ్‌ కింగ్స్‌(PBKS) జట్టులో సభ్యుడయ్యాడు. క్రమక్రమంగా మెరుగుపడుతూ కీలకమైన బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు టీమిండియాకు ఎంపికయ్యాడు. అతడే అర్ష్‌దీప్‌ సింగ్.. అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ముఖ్యంగా డెత్ ఓవర్ల(Death Overs)లో అతని సమర్థవంతమైన బౌలింగ్‌కు పేరుగాంచాడు. IPL 2022 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ అతనిని రిటైన్‌ చేసుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అర్ష్‌దీప్‌ ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఐపీఎల్ 2022లో అర్ష్‌దీప్ సింగ్‌కు ఎక్కువ వికెట్లు దక్కలేదు. కానీ డెత్ ఓవర్లలో అతను చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అలాగే అతను తీసిన వికెట్లలో అత్యధికం డెత్ ఓవర్లలోనే తీశాడు.

ఐపీఎల్ 2022లో 14 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 10 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని ఎకానమీ 7.70గా ఉంది. టీ20 క్రికెట్‌లో డెత్ ఓవర్లు ముఖ్యమైనవి. అర్ష్‌దీప్ సింగ్ చిన్ననాటి కోచ్ జస్వంత్ రాయ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు. “ఐపిఎల్ 2022లో డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌పై అతని నియంత్రణ అద్భుతమైనది. లీగ్‌లో డెత్ ఓవర్లలో అత్యుత్తమ సగటు ఉన్న బౌలర్లలో అతను ఒకడు. డెత్ ఓవర్లలో పరుగులు ఆపడం, వికెట్లు తీయడం రెండింటిలోనూ సత్తా చాటాడు. అందుకే అతను సెలక్టర్ల దృష్టిలో పడగలిగాడు.” అని అన్నాడు. “వసీం అక్రమ్ బౌలింగ్ వీడియోలను చూపించడం ద్వారా అతనికి బౌలింగ్ నేర్పించాను. నేను అతనికి వసీం అక్రమ్ బౌన్సర్లను చూపించాను. అక్రమ్ లాగా క్రీజులో బౌలింగ్ చేసేవాడు, అన్నీ చూపించి బౌలింగ్ నేర్పించాను.” అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…