AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 హిస్టరీలోనే ఎవ్వరూ సాధించలేని రికార్డ్ భయ్యా ఇది.. రోహిత్ దోస్త్ మిరాకిల్ మాములుగా లేదుగా

Kieron Pollard Records: 38 ఏళ్ల కీరాన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు, ఈ రికార్డుల జాబితాకు మరో ప్రపంచ రికార్డు జోడించాడు. అది కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇంతకు ముందు ఏ ఆటగాడు చేయలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 హిస్టరీలోనే ఎవ్వరూ సాధించలేని రికార్డ్ భయ్యా ఇది.. రోహిత్ దోస్త్ మిరాకిల్ మాములుగా లేదుగా
Kieron Pollard
Venkata Chari
|

Updated on: Sep 23, 2025 | 7:40 PM

Share

Kieron Pollard Records: టీ20 క్రికెట్‌లో కీరాన్ పొలార్డ్ ప్రపంచ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈసారి కరేబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా 700 మ్యాచ్‌లు, 14 వేల పరుగుల ప్రపంచ రికార్డును రాసిన పొలార్డ్ ఇప్పుడు మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సీపీఎల్ ఫైనల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడిన కీరన్ పొలార్డ్ మొత్తం 4 క్యాచ్‌లు పట్టాడు. ఈ క్యాచ్‌లతో పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 400 క్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు.

వెస్టిండీస్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్ జట్ల తరపున 720 మ్యాచ్‌లు ఆడిన కీరన్ పొలార్డ్ ఇప్పటివరకు 401 క్యాచ్‌లు పట్టాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో 400+ క్యాచ్‌లు పట్టిన ప్రపంచంలోనే ఏకైక ఫీల్డర్‌గా అతను ఘనత సాధించాడు.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కీరన్ పొలార్డ్ తప్ప, ప్రపంచంలో మరే ఆటగాడు టీ20 క్రికెట్‌లో 350 కంటే ఎక్కువ క్యాచ్‌లు తీసుకోలేదు. 320 క్యాచ్‌లు తీసుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

ఇప్పుడు 400+ క్యాచ్‌లతో కొత్త మైలురాయిని దాటిన కీరన్ పొలార్డ్, రాబోయే టీ20 మ్యాచ్‌లలో 326 పరుగులు చేస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. అంటే టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ (14562) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి కీరన్ పొలార్డ్ (14237) కు ఇంకా 326 పరుగులు మాత్రమే అవసరం. అందువల్ల టీ20 పరుగుల జాబితాలో కూడా పొలార్డ్ అగ్రస్థానంలో ఉంటాడని ఆశించవచ్చు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!