AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అంపైర్ వల్లే ఓడిపోయాం.. భారత్‌పై ఓటమితో పాక్ కెప్టెన్ మెంటల్ స్టేట్‌మెంట్

Salman Ali Agha on Fakhar Zaman wicket controversy: సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా విలేకరుల సమావేశంలో కనిపించాడు. ఈ క్రమంలో ఫఖర్ జమాన్ అవుట్ గురించి ఆయనను ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కెప్టెన్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం గమనార్హం.

Video: అంపైర్ వల్లే ఓడిపోయాం.. భారత్‌పై ఓటమితో పాక్ కెప్టెన్ మెంటల్ స్టేట్‌మెంట్
Salman Ali Agha
Venkata Chari
|

Updated on: Sep 22, 2025 | 4:38 PM

Share

Salman Ali Agha on Fakhar Zaman wicket Controversy: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఔట్ అయిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని ఫఖర్ జమాన్ బ్యాట్ అంచుకు తాకి కీపర్ సంజూ శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. అయితే, శాంసన్ క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకిందా లేదా అనే దానిపై సందేహం నెలకొనడంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. పలు కోణాల్లో రివ్యూ చూసిన తర్వాత థర్డ్ అంపైర్ ఫఖర్‌ను ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయంపై పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫఖర్ జమాన్ ఔట్ అయిన తర్వాత కూడా తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశాడు. అతని ఔట్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రముఖ వ్యాఖ్యాతలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, అంపైర్ నిర్ణయం సరికాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ వివాదంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆలీ ఆఘా పోస్ట్-మ్యాచ్ ప్రెస్‌మీట్‌లో స్పందిస్తూ, విమర్శలకు గురైన అంపైర్ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. “నిర్ణయం గురించి నాకు నిజంగా తెలియదు. అయితే, నాకు అనిపించినంతవరకు, బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లడానికి ముందు నేలకు తగిలినట్టు అనిపించింది. కానీ అంపైర్లు కూడా తప్పులు చేయొచ్చు. నేను కూడా తప్పుగా చూసి ఉండవచ్చు” అని సల్మాన్ పేర్కొన్నాడు.

ఫఖర్ జమాన్ ఆడుతున్న తీరును ప్రశంసిస్తూ, అతను గనుక పవర్‌ప్లేలో కొనసాగించి ఉంటే స్కోర్ 190కి చేరుకునేదని అభిప్రాయపడ్డాడు. ఫఖర్ ఔట్ జట్టుపై ప్రభావం చూపినప్పటికీ, ఓటమికి ఇది ఒక్కటే కారణం కాదని, భారత్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసిందని, తమ జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు కూడా ఓటమికి దారితీశాయని ఆఘా అంగీకరించాడు.

సల్మాన్ ఆలీ ఆఘా చేసిన ఈ వ్యాఖ్యలు, వివాదంపై ప్రత్యక్షంగా స్పందించకుండానే, అంపైర్ నిర్ణయంపై సందేహాలను వ్యక్తం చేయడం ద్వారా విమర్శకులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినట్టుగా భావించవచ్చు. మొత్తంగా, ఫఖర్ జమాన్ ఔట్ వివాదం, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఈ విషయంలో ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..