West Indies: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిస్టరీ స్పిన్నర్.. తొలి, చివరి మ్యాచ్‌లు భారత్‌పైనే..
Sunil Narine Retires: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం వెస్టిండీస్‌కు చివరిసారిగా ఆడిన నరైన్.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. సునీల్ నరైన్ వెస్టిండీస్ తరపున 8 ఏళ్లలో 122 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీని 10 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఎదుర్కొన్న నరైన్ రెండుసార్లు ఔట్ కావడం ఇక్కడ ప్రత్యేకత. విరాట్ కూడా నరైన్‌పై 102 బంతులు ఎదుర్కొని 45 సగటుతో 90 పరుగులు చేశాడు.
Sunil Narine Retires: వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ కం మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం వెస్టిండీస్‌కు చివరిసారిగా ఆడిన నరైన్.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నరైన్.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతానంటూ చెప్పుకొచ్చాడు. 35 ఏళ్ల నరైన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 65 వన్డేలు, 51 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. ఈ ఫార్మాట్‌లలో కలిపి 165 వికెట్లు కూడా తీశాడు.
తన సోషల్ మీడియా ఖాతాలో రిటైర్మెంట్ గురించి రాసుకొచ్చిన నరైన్.. “నేను బహిరంగంగా చాలా తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తిని. మీరు కూడా చూశారు. నేను దేశం (వెస్టిండీస్) తరపున ఆడి 4 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నేను నా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. వెస్టిండీస్‌కు ఆడాలనే నా కలను సాకారం చేసుకోవడానికి సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నా కలను సాకారం చేసుకునేందుకు మా కుటుంబం, నాన్న ఎంతగానో సహకరించారు. వారి ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన వారి ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను’ అంటూ ప్రకటించాడు.
భారత్‌తో తొలి, చివరి మ్యాచ్ కూడా..
సునీల్ నరైన్ 2011లో భారత్‌పై వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంటే అతని అంతర్జాతీయ అరంగేట్రం భారత్‌పైనే. యాదృచ్ఛికంగా, నరైన్ చివరి మ్యాచ్ కూడా భారత్‌పైనే కావడం గమనార్హం. వన్డే క్రికెట్‌లో కెరీర్ ప్రారంభించిన నరైన్, 2019లో టీ20లో తన చివరి మ్యాచ్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో నరైన్ ప్రదర్శన..
View this post on Instagram
సునీల్ నరైన్ వెస్టిండీస్ తరపున 8 ఏళ్లలో 122 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీని 10 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఎదుర్కొన్న నరైన్ రెండుసార్లు ఔట్ కావడం ఇక్కడ ప్రత్యేకత. విరాట్ కూడా నరైన్‌పై 102 బంతులు ఎదుర్కొని 45 సగటుతో 90 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచకప్ హీరో..
వెస్టిండీస్ క్రికెట్‌కు సునీల్ నరైన్ అందించిన సహకారం గురించి మాట్లాడితే.. వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ 2012 గెలవడంలో నరైన్ సహకారం అపారమైనది. ఇప్పుడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న నరైన్ 2012 నుంచి ఈ జట్టుతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కేకేఆర్ తరపున నరైన్ 162 మ్యాచ్‌లు ఆడి 163 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..