
Bizarre Cricket Prizes: క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు రావడం సాధారణం. కొన్నిసార్లు ఊహించని వింత కానుకలు వారి చేతుల్లోకి వస్తుంటాయి. మ్యాచ్ బంతిని చెరిసగం చేసుకోవడం మొదలుకొని మిక్సీలు, అమెరికాలో భూమి వరకు క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లకు దక్కిన అత్యంత విచిత్రమైన జ్ఞాపికల వెనుక ఉన్న అసలు కథలేంటో తెలుసుకుందాం..
పాకిస్థాన్‌తో లీడ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయారు. ఇద్దరూ చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేశారు. సాధారణంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ ఆ మ్యాచ్ బంతిని జ్ఞాపకంగా తనతో తీసుకెళ్లడం ఆనవాయితీ. ఇద్దరు బౌలర్లూ సమానంగా చెలరేగడంతో ఒకే బంతి కోసం పోటీ పడకుండా, దానిని సరిగ్గా రెండు భాగాలుగా కత్తిరించి చెరి సగం పంచుకున్నారు. ఇలాంటి అరుదైన ఫీట్ మళ్లీ రాకపోవచ్చని, అందుకే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని రాబిన్సన్ పేర్కొన్నారు. క్రికెట్ మైదానాల్లో ఇలాంటి వింత బహుమతులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు.
Just noticed the trophy for the Australia vs Scotland series winner 😋 pic.twitter.com/XnjH3Yiffj
— Sameer Allana (@HitmanCricket) September 10, 2024
Pleased we won my first match 4 Abahani today. Have 2 say I have never been given a blender 4 getting MOM before! pic.twitter.com/BkiycrpJgu
— Luke Wright (@lukewright204) October 31, 2013
గతంలో బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీ అయిన ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లాండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ ఒత్తిడిని అధిగమించి 86 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఆయనకు ఒక ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ బహుమతిగా ఇచ్చారు. అదే లీగ్‌లో ఆల్‌రౌండ్ షోతో 66 పరుగులు, 3 వికెట్లు తీసిన ల్యూక్ రైట్ చేతికి బ్లెండర్ ఇచ్చి సత్కరించారు.
— crictalk (@crictalk7) August 21, 2026
2017లో శ్రీలంక పర్యటనలో 15 వికెట్లతో సత్తా చాటిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఏకంగా ఒక మినీ ట్రక్కు దక్కింది. మైదానంలో ఆ వాహనాన్ని ఎంఎస్ ధోని డ్రైవ్ చేస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా విక్టరీ ల్యాప్ కొట్టిన దృశ్యాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తే.
ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?
After winning Hairdryer as a man of the match James Vince posted his story 👌👌👌#PSL2025 #PSLX #PSL10 #KKvLQ #LQvKK pic.twitter.com/WnBFFxMMej
— Fourth Umpire (@UmpireFourth) April 15, 2025
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 సీజన్‌లో కరాచీ కింగ్స్ బ్యాటర్ జేమ్స్ విన్స్ 43 బంతుల్లోనే 101 పరుగులు చేసి మెరుపు సెంచరీ సాధించారు. డ్రెస్సింగ్ రూమ్ స్పాన్సర్ అవార్డు కింద ఆయనకు హెయిర్ డ్రైయర్ లభించింది. దీనిపై ఆయన సోషల్ మీడియాలో సరదాగా స్పందించారు. 2026 ఐఎల్‌టీ20లో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు నిర్వాహకులు రేసింగ్ సైకిల్ బహూకరించారు.
— crictalk (@crictalk7) August 21, 2026
వీటన్నింటినీ మించి గ్లోబల్ టీ20 కెనడా 2023 టోర్నీలో మాంట్రియల్ టైగర్స్ తరఫున అదరగొట్టిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యారు. ఆయనకు ఏకంగా అమెరికాలో అర ఎకరం భూమిని బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెను సంచలనమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..