AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది పాటు నిషేధం.. కట్‌చేస్తే.. 11 ఫోర్లు, 11 సిక్సర్లు.. 72 బంతుల్లో రికార్డుల ఊచకోత..!

Kamil Mishara Record: శ్రీలంక దేశవాళీ క్రికెట్‌లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదైంది. మేజర్ క్లబ్స్ టీ20 టోర్నమెంట్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ కమిల్ మిషార క్రీజులో పరుగుల వర్షం కురిపించాడు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో అసాధారణ సెంచరీతో చెలరేగి, టీ20 క్రికెట్‌లో ఒక శ్రీలంక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Venkata Chari
|

Updated on: Aug 20, 2026 | 6:30 PM

Share
Kamil Mishara Record: కొలంబోలో బ్లూమ్‌ఫీల్డ్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) తరఫున బరిలోకి దిగిన కమిల్ మిషార విధ్వంసకర ఆటతీరు కనబరిచాడు. కేవలం 72 బంతుల్లో 145 పరుగులు చేసి చివరివరకు అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 11 సిక్సర్లు బాదడం ద్వారా ఏకంగా 110 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రాబట్టాడు.

1 / 5
ఈ సుడిగాలి ఇన్నింగ్స్ ఫలితంగా నాన్‌డిస్క్రిప్ట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ప్రత్యర్థిని నిలువరించి 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంక తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

2 / 5
ప్రతిభ ఉన్నప్పటికీ గతంలో క్రమశిక్షణా రాహిత్యంతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు. 2019 అండర్-19 ఆసియా కప్ సమయంలో హోటల్ గదిలో మద్యం తాగి పట్టుబడటంతో సమస్యలు కొనితెచ్చుకున్నాడు. ఆ తర్వాత 2022 బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా కోవిడ్ బయో-బబుల్ నిబంధనలను ఉల్లంఘించడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది.

3 / 5
ఆ చేదు అనుభవాలను వెనక్కి నెట్టి మైదానంలో బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. తాజా ప్రదర్శనతో తిరిగి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని దేశవాళీ పోరులో రికార్డుల సెంచరీతో సత్తా చాటాడు. నిలకడగా రాణిస్తే శ్రీలంక జాతీయ జట్టులోకి తిరిగి అడుగుపెట్టే అవకాశాలు మరింత మెరుగవుతాయి.

4 / 5
కొలంబోలో బ్లూమ్‌ఫీల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో కమీల్ మిషారా 72 బంతుల్లో అజేయంగా 145 పరుగులు చేసి, టీ20ఐలలో అత్యధిక స్కోరు సాధించిన శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా నిలిచి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

5 / 5
Follow Us