Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ బర్త్‎డే.. CSK టీం సభ్యులు ఏం చేశారో తెలుసా.. వైరలైన వీడియో..

దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‎ను 27 పరుగుల తేడాతో ఓడించి నాల్గో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను చెన్నై సూపరి కింగ్స్ సొంతం చేసుంది. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు...

Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ బర్త్‎డే.. CSK టీం సభ్యులు ఏం చేశారో తెలుసా.. వైరలైన వీడియో..
Shardulu
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 16, 2021 | 2:42 PM

దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‎ను 27 పరుగుల తేడాతో ఓడించి నాల్గో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను చెన్నై సూపరి కింగ్స్ సొంతం చేసుంది. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కెప్టెన్ ధోనీ దగ్గరుండి శార్దూల్‎తో కేక్‌ను కట్ చేయించారు. దీంతో జట్టు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పాటలు పాడారు. ఠాకూర్‎పై డ్రింక్ పోశారు. ధోనీ శార్దూల్‌‎కు కేక్ తినిపించారు. ఇదంతా వీడియో తీశారు. వీడియోను సీఎస్కే తన ట్విట్టర్‎లో పోస్ట్ చేసింది.”గో శార్దూల్ .. ఇది మీ పుట్టిన రోజు! #సూపర్ బర్త్‌డే #WhistlePodu # Yellove @imShard” అంటూ రాసుకొచ్చారు.

కేకేఆర్‎పై సీఎస్కే గెలిచిన వెంటనే ఈ వేడుకలు జరిగాయి. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ డూప్లిసిస్, మొయిన్ అలీ, గైక్వాడ్ రాణించండంతో 20 ఓవర్లకు192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‎కు కోల్‎‎కత్తా నైట్‎రైడర్స్ తొమ్మిది వికెట్ల్ కోల్పోయి 165 పరుగులే చేసింది. దీంతో చైన్నై 27 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఐపీఎల్-2021 కప్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‎లో శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2021లో బ్యాటింగ్‎లో విఫలమైనప్పటికీ బౌలింగ్‎లో రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‎లో చక్కటి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. శార్దూల్‌కు యూఏఈ, ఒమన్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ పాల్గొనబోయే భారత జట్టులో స్థానం లభించింది. ఆక్సర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.

Read Also.. Rahul Dravid: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. ఒప్పించిన బీసీసీఐ