టీమ్ ఇండియాకు త్వరలో కొత్త ప్రధాన కోచ్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓడిపోయింది. త్వరలో జరిగే టీ 20 ప్రపంచకప్ తో ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అదే సమయంలో కొత్త కోచ్ పదవికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత టీమ్ ఇండియాకు కొత్త కోచ్ వచ్చే అవకాశం ఉంది.
🚨 REPORTS 🚨
Rahul Dravid is unlikely to reapply for the position of head coach of the Indian cricket team ❌
The BCCI have a huge challenge on their hands of finding a worthy successor to guide the team 🏏 #RahulDravid #India pic.twitter.com/McKRX8i8zk
— Sportskeeda (@Sportskeeda) May 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..